తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. శానిటైజర్ తాగి నలుగురు మృతి చెందారు. నగరంలోని స్కావెంజర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు మున్సిపాలిటీ ఉద్యోగులు కాగా, మరో ఇద్దరు చిత్తు కాగితాలు ఏరుకునే వారని తెలుస్తోంది.

తిరుపతి రుయా ఆసుపత్రిలో వీరి మృతదేహాలున్నాయి. శానిటైజర్ కారణంగానే వీరు చనిపోయినట్లు మృతుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం బాబులతో మద్యం అలవాటును మాన్పించాలని ప్రభుత్వం మద్యం ధరలను దాదాపు రెట్టింపు చేసింది.

ఇదే సమయంలో కరోనా వైరస్ రావడంతో చుక్క దొరక్క మందు బాబులు పిచ్చెక్కిపోయారు. దీంతో ప్రభుత్వం మళ్లీ ధరలను పెంచింది. ఎప్పుడైతే మద్యం ధరలు పెరిగిపోయాయో, మందుబాబులు హ్యాండ్ శానిటైజర్లను తాగడం మొదలుపెట్టారు. అంతంత రేటు పెట్టి మద్యం కొనుక్కునే బదులు.. శానిటైజర్ కొనుక్కోవడం బెటరని భావించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు