హిందూపురంలో తృటిలో తప్పిన ప్రమాదం: వరద నీటిలో చిక్కుకొన్న ఆర్టీసీ బస్సు, 30 మంది ప్రయాణీకులు క్షేమం

హిందూపురం కొట్నూరు చెరువు వద్ద లో లెవల్ వెంతన లో ఆర్టీసీ బస్సు చిక్కుొంది. ఈ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణీకులున్నారు. ఈ ప్రయాణీకులను స్థానికులు రక్షించారు.

30 passengers safely escaped from flood water near Hindupur

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం  వద్ద వరద నీటిలో చిక్కుకొన్న ఆర్టీసీ బస్సులో నుండి 30 మంది ప్రయాణీకులను స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. లోలెవల్ కాలువలో వరద ఉధృతిని తక్కువగా అంచనా వేసిన డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో వరదలో బస్సు చిక్కుకుపోయింది. అంతేకాదు వరద ఉధృతికి బస్సు కుడివైపునకు తిరగి రోడ్డుకు పక్కనే ఉన్న రెయిలింగ్ ను ఢీకొని నిలిచిపోయింది. ఈ సమయంలో లో లెవల్ వద్ద వరద ఉధృతి పెరిగింది. ఈ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణీకులున్నారు వరద ప్రవాహం పెరుగుతున్న విషఁయాన్ని గమనించిన స్థానికులు బస్సులోని ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

సోమవారం నాడు ఉదయం అనంతపురం జిల్లాలోని హిందూపురం కొట్నూరు చెరువు లో లెవల్ వంతెన వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. లో లెవల్ వంతెన  నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తున్నా కూడా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు తీసుకుపోవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకొంది. Andhra pradesh రాష్ట్రంలోని Chittoor, nellore, kadapa జిల్లాల్లో heavy rains కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో పట్టాలపైకి వరద నీరు చేరడంతో పలు రైళ్లను దారి మళ్లించారు. మరికొన్ని trains రద్దు చేశారు. నెల్లూరు జిల్లాలోని కోవూరు వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోయింది.  దీంతో రాకపకోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

also read:కడపలో విషాదం: పుట్టినరోజునే బాలికను కబళించిన వరదలు... సోదరుడితో సహా నదిలో గల్లంతు

మరో వైపు కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమలాపురానికి సమీపంలోని పాపాగ్ని నదిపై ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో వాహన రాకపోకలను నిలిపివేశారు. కడప జిల్లా నుండి తాడిపత్రికి ఈ వంతెన గుండానే వాహనాలు వెళ్తాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలను సాగించాలని అధికారులు వాహనదారులకు సూచించారు.

ఆదివారం నాడు తెల్లవారుజామున కడప పట్టణంలోని రాధాకృష్ణనగర్‌లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో భవనంలో చిక్కుకొన్న తల్లీ కూతుళ్లను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
కడప జిల్లాలోని నందలూరు వద్ద వరద నీటిలో మూడు ఆర్టీసీ బస్సులు చిక్కుకొన్న ఘఢటనలో ముగ్గురు మృతి చెందారు. మరో వైపు రాజంపేట సమీపంలోని చెయ్యేరు వరద నీటిలో సమీపంలో గ్రామాల ప్రజలు గల్లంతయ్యారు.ఈ ఘటనలో ఇప్పటికే 26 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు.  అనంతపురం జిల్లాలో నదిలో చిక్కుకొన్న ప్రయాణీకులను అధికారులు రక్షించారు.

టెంపుల్ సిటీ తిరుపతి నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. భారీ వర్షం కారణంగా తిరుపతి ఘాట్ రోడ్డు మార్గంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. మరో వైపు మెట్ల మార్గాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు. మెట్ల మార్గంలో కొండ చరియలను తీసివేసే ప్రక్రియ కొనసాగుతుంది. తిరుమల ఘాట్ రోడ్డుకు కూడా మరమ్మత్తులు చేస్తున్నారు. తిరుపతికి సమీపంలోని రాయల చెరువు కట్టకు ప్రమాదం పొంచి ఉంది. కట్ట నుండి నీరు లీకేజీ అవుతుంది. దీంతో సమీప గ్రామాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు ఈ కట్ట తెగకుండా అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. చెరువు కట్ట నుండి నీరు లీకౌతున్న ప్రాంతంలో ఇసుక బస్తాలను వేశారు. మరో వైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దం చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios