పోలవరానికి తెలంగాణ సర్కార్ కొర్రీ

3 states join hands to fight against Polavaram
Highlights

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఒడిశా రాష్ట్రప్రభుత్వం దాకలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం నాడు విచారణ చేపట్టింది.అయితే విచారణ అంశాలను ఎందుకు తయారు చేయలేదని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఒడిశా రాష్ట్రప్రభుత్వం దాకలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం నాడు విచారణ చేపట్టింది.అయితే విచారణ అంశాలను ఎందుకు తయారు చేయలేదని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. ఈ నెల 30వ తేదీకి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

 పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌నపై జస్టిస్  బీ లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం నాడు విచారణ చేసింది. 

అయితే  ఏ అంశాలపై వాదనలు విన్పించాలనే దానిపై నివేదికలు ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పోలవరం ప్రాజెక్టు  నిర్మాణం విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ తీరును తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

విచారణ అంశాలను నిర్ణయించకపోతే  వాటిని తామే నిర్ణయిస్తామని  సుప్రీంకోర్టు ప్రకటించింది.  తదుపరి విచారణను జూలై30వ తేదీకి వాయిదా వేస్తూ  సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొంది. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదిలోపుగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరుణంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణంపై మూడు రాష్ట్రాలు కూడ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ రాష్ట్రాలను ప్రాజెక్టు నిర్మాణం కోసం ఒప్పించుకోకపోతే భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు తప్పకపోవచ్చే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

loader