అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పరిశ్రమల శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పూనమ్ మాలకొండయ్యకు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. శ్రికేష్ బాలాజీరావును మార్క్ ఫెడ్ ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసిం పీఎస్ ప్రద్యుమ్నకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. 

 ఆంధ్రప్రదేశ్‌లో కరోనా  కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వైద్యం, అత్యవసర సేవలను ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది.ఆరు నెలల పాటు వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, రవాణా ఎస్మా పరిధిలోకి వస్తాయి. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని జీవోలో పేర్కొన్నారు.

ఎస్మా పరిధిలోకి డాక్టర్లు, వైద్య సిబ్బందితో పాటు వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణాను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చింది.
విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా కేసులు తక్కువగా వుండగా.. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో మాత్రం కరోనా కేసులు ఎక్కువగా ఉండటం గమనార్హం. మరోవైపు మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం కోరింది.

అలాగే రాష్ట్రంలోని నాలుగు చోట్ల కరోనా వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకమైన ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. నియోజకవర్గ కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా ప్రభుత్వం స్పెషల్ హాస్పిటల్స్‌ను సిద్ధం చేసింది.