విద్యుత్ దీపాలు సరిచేస్తుండగా ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన గుంటూరు జిల్లా మంగళపాలెంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... మంగళపాలెంలోని పెట్రోల్ బంక్ వద్ద విద్యుత్ దీపాలు సరిగా పనిచేయడం లేదు. దీంతో శనివారం ఉదయం ముగ్గురు కార్మికులు వాటిని రిపేర్ చేస్తున్నారు.

also Read బాలికకు వేధింపులు.. కాపాడాల్సిన తండ్రే రాక్షసుడికి కాపలాకాసి....

ఆ సమయంలో ఐరన్ స్టాండ్ 11కేవీ లైన్ కి తగిలింది. దీంతో... విద్యుత్ దీపాలు సరిచేస్తున్న ముగ్గురు కార్మికులకు విద్యుదాఘాతం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.