Asianet News TeluguAsianet News Telugu

తూర్పు గోదావరి జిల్లాలో మృతదేహాల కలకలం: సముద్ర తీర ప్రాంతానికి కొట్టుకొచ్చిన 3 డెడ్ బాడీలు

తూర్పు గోదావరి జిల్లాలోని సఖినేటిపాలెం మండలంలోని అంతర్వేది, కేశదాసుపాలెంగ్రామాల సరిహద్దుల్లో గల సముద్ర తీర ప్రాంతాల్లో గురువారం నాడు మృతదేహలు కలకలం సృష్టించాయి.
 

3 dead bodies washed ashore near keshavadasupalem in east godavari distirct
Author
Kakinada, First Published Sep 3, 2020, 3:50 PM IST


అంతర్వేది: తూర్పు గోదావరి జిల్లాలోని సఖినేటిపాలెం మండలంలోని అంతర్వేది, కేశదాసుపాలెంగ్రామాల సరిహద్దుల్లో గల సముద్ర తీర ప్రాంతాల్లో గురువారం నాడు మృతదేహలు కలకలం సృష్టించాయి.

సముద్రం నుండి మూడు మృతదేహలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

మూడు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. సముద్రం నుండి ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. అయితే ఈ మృతదేహలు ఎవరివనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నీటిలో పడి చనిపోయిన వారి మృతదేహలు కొట్టుకువచ్చాయా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

సముద్రం నుండి మృతదేహాలు కొట్టుకురావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చనిపోయిన వారు ఎవరు.. ఎంత కాలం క్రితం మరణించారనే విషయాలను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సముద్ర తీర ప్రాంతాల్లో అప్పుడప్పుడూ ఈ తరహాలోనే మృతదేహలు బయటకి వచ్చిన ఘటనలు గతంలో చోటు చేసుకొన్నాయి. అయితే ఈ దఫా ఒకేసారి 3 మృతదేహాలు కొట్టుకురావడంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios