మూడు రాజధానుల బిల్లుకు నేడు గవర్నర్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. గవర్నర్ తన అంగీకారం తెలపడంతో ఇక మూడు రాజధానుల ఏర్పాటు లాంఛనమే. మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ సర్కారు తీసుకున్నప్పటినుండే అమరావతి ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

ఈ సందర్భంగా జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పటినుండి పరిస్థితులు ఎలా మారాయో ఒకసారి చూద్దాము. 

2019, సెప్టెంబర్ 13న రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు  

2019, డిసెంబర్ 20న పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు చేసింది 

2019, డిసెంబర్ 29న పరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించి హైపవర్ కమిటీ ఏర్పాటు చేసారు 

2020, జనవరి 3న బోస్టన్ కన్సెల్టెన్సీ గ్రూపు తమ నివేదికను సబ్మిట్ చేసింది  

2020, జనవరి 17న రెండు కమిటీల నివేదికలపై(జిఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్) హైపవర్ కమిటీ చర్చ  

2020, జనవరి 20న హైపవర్ కమిటీ నివేదికపై క్యాబినెట్ లో చర్చ  

2020, జనవరి 20న బిల్లును అసెంబ్లీ  ఆమోదించింది

2020, జనవరి 22న బిల్లు శాసనమండలి ముందుకు వచ్చింది  

2020, జూన్ 16న రెండోసారి అసెంబ్లీ ముందుకు వికేంద్రీక్రణ బిల్లు, ఆమోదం 

2020, జూన్ 17తో మండలి ముందుకు  

నేడు గవర్నర్ ఆమోదం. ఇది ఇప్పటివరకు ఈ మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి జరిగిన సంఘటనల సమాహారం.