ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపడుతున్నారు. 294 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి బాధ్యతల్లోకి తీసుకోనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో కార్యణ నియామకాలు చేపడుతున్నారు. 2016 జనవరి 1వ తేదీ నుంచి 2019 డిసెంబర్ 31వ తేదీల మధ్యలో ఆర్టీసీ సర్వీసులో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులలో ఒకరిని ఉద్యోగానికి ఎంచుకున్నారు. కారుణ్య నియామకాలకు సంబంధించి జగన్ ప్రభుత్వం ఔదార్యం కనబరిచిందని, 294 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగ అవకాశాలను కల్పించిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. 294 మందిలో 34 మంది జూనియర్ అసిస్టెంట్లు, 99 మంది ఆర్టీసీ కానిస్టేబుల్స్, ఒక డ్రైవర్, 61 మంది కండక్టర్లు, 99 మంది అసిస్టెంట్ మెకానిక్‌లుగా ఉద్యోగ అవకాశాలు కల్పించిందని వివరించారు.
విజయవాద విద్యాధరపురంలోని ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్‌పోర్ట్ అకాడమీలో కారుణ్య నియామకం క్రింద ఎంపికైన 34 మంది జూనియర్ అసిస్టెంట్‌లకు ఇండక్షన్ ట్రైనింగ్ శిక్ష క్లాసులను ఎండీ ద్వారకా తిరుమల రావు ప్రారంభించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు.
20 మంది స్త్రీలు, 14 మంది పురుషులు మొత్తం 34 మంది అభ్యర్థులకు ఎండీ ద్వారకా తిరుమల రావు స్వాగతం పలికారు. వివిధ రకాల బ్యాక్‌గ్రౌండ్ నుంచి, వివిధ విద్యార్హతలు గల అభ్యర్థులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారని వివరించారు. ఈ ఉద్యోగావకాశంతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
Also Read: విశాఖపట్నంలో దిశ SOS ఎఫెక్ట్.. యువతి కాల్ చేయగానే వెంటనే స్పాట్‌కు దిశ టీం
శిక్షణా కాలంలో స్టైఫండ్ చెల్లించనున్నట్లు ఆయన వివరించారు. ఈ క్లాసులు మూడు నెలలపాటు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్ బ్రహ్మానంద రెడ్డి పరిచయ ప్రసంగం చేశారు. ట్రాన్స్‌పోర్టు అకాడమీ ప్రిన్సిపాల్ కుమారి డి సాంబ్రాజ్యం, ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
