Asianet News TeluguAsianet News Telugu

రాజమండ్రి జైలులో 265 మంది ఖైదీలకు కరోనా: ములాఖత్ నిలిపివేత

రాజమండ్రి సెంట్రల్ జైలులో 265 మంది ఖైదీలకు కరోనా సోకింది. దీంతో ఖైదీలకు ములాఖత్ ను నిలిపివేశారు. మరో వైపు 24 మంది జైలు సిబ్బందికి కూడ కరోనా సోకినట్టుగా అధికారులు ప్రకటించారు. 

265 prisoners tested corona positive in Rajahmundry  central jail
Author
Rajahmundry, First Published Aug 7, 2020, 1:31 PM IST

రాజమండ్రి:రాజమండ్రి సెంట్రల్ జైలులో 265 మంది ఖైదీలకు కరోనా సోకింది. దీంతో ఖైదీలకు ములాఖత్ ను నిలిపివేశారు. మరో వైపు 24 మంది జైలు సిబ్బందికి కూడ కరోనా సోకినట్టుగా అధికారులు ప్రకటించారు. 

ఈ జైలులో కరోనా కలకలం సృష్టించింది. ఇప్పటికే 52 మందికి కరోనా సోకింది. బుధవారం నాడు మరో 10 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ జైలులోని 28 మంది ఖైదీలకు, 24 మంది జైలు సిబ్బందికి కరోనా సోకింది.

ఈ జైలులోని ఖైదీలు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఇంకా కొందరి ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికే 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు  నిర్వహించారు. ఈ జైలులో 1670 ఖైదీలు, 200 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటికే 265 మంది ఖైదీలకు కరోనా సోకినట్టుగా వైద్యులు ప్రకటించారు.

also read:రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం: 62 మందికి కరోనా

జైలులో కరోనా కేసులు పెరిగిపోవడంతో ఖైదీలకు ములాఖత్ ను నిలిపివేశారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గురువారం  నాటికి ఏపీలో కరోనా కేసులు 1.96 ,789 కిలక్షలకు చేరుకొన్నాయి. గురువారం నాడు  10,328  కరోనా కేసులు రికార్డయ్యాయి.

రాష్ట్రంలో కరోనాతో మరణించే వారి సంఖ్య కూడ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనాను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలు కూడ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios