రాజమండ్రి:తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం సృష్టించింది. ఇప్పటికే 52 మందికి కరోనా సోకింది. బుధవారం నాడు మరో 10 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ జైలులోని 28 మంది ఖైదీలకు, 24 మంది జైలు సిబ్బందికి కరోనా సోకింది.

ఈ జైలులోని ఖైదీలు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఇంకా కొందరి ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికే 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు  నిర్వహించారు. ఈ జైలులో 1670 ఖైదీలు, 200 మంది సిబ్బంది ఉన్నారు. 

జైలులో కరోనా కేసులు పెరిగిపోవడంతో ఖైదీలకు ములాఖత్ ను నిలిపివేశారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బుధవారం నాటికి ఏపీలో కరోనా కేసులు 1.86 లక్షలకు చేరుకొన్నాయి. బుధవారం నాడు సుమారు 10వేలకుపైగా కరోనా కేసులు రికార్డయ్యాయి.

రాష్ట్రంలో కరోనాతో మరణించే వారి సంఖ్య కూడ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనాను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలు కూడ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.