రెండేళ్ల చిన్నారిపై పద్నాలుగేళ్ల బాలుడు అత్యాచారం

2 year old girl raped by 14 year old boy near Srikakulam
Highlights

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో దారుణం

అభం శుభం తెలియని రెండేళ్ల చిన్నారిపై ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డారు.  ఏం చేస్తున్నాడో కూడా తెలియని వయసులో ఆ బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరులో చోటుచేసుకుంది.

ఈ  ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ రెండేళ్ల బాలిక తన ఇంటి బయట ఆడుకుంటోంది. చిన్నారి ఒంటరిగా ఉండడాన్ని గమనించిన పక్కింట్లోని 14ఏళ్ల బాలుడు ఆడుకుంటున్న చిన్నారిని తమ ఇంట్లోకి తీసుకెళ్లాడు.  ఇంట్లో బాలికను వివస్త్రను చేసి అత్యాచారం చేస్తుండగా చిన్నారి తాత దీన్ని గమనించాడు. 

అతడు ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకకెళ్లాడు. గ్రామస్తులంతా కలిసి బాలుడి కుటుంబసభ్యులను ఈ విషయంపై నిలదీశారు. మరోసారి ఇలాంటి దారుణాలు జరగక్కుండా బాలున్ని పోలీసులకు అప్పగించాలని నిర్ణయించారు.

దీంతో పాప కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలున్ని జువైనల్ హోం కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

 
 

loader