Asianet News TeluguAsianet News Telugu

జెఈఈ మెయిన్ లో తెలుగు సత్తా: మొదటి ఐదుగురు టాపర్స్ లో ముగ్గురు

జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష జెఈఈ మెయిన్ లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తొలి ఐదుగురు టాపర్స్ లో ముగ్గురు తెలుగువారే కావడం విశేషం.

2 of 5 JEE toppers are from Telugu states

హైదరాబాద్: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష జెఈఈ మెయిన్ లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తొలి ఐదుగురు టాపర్స్ లో ముగ్గురు తెలుగువారే కావడం విశేషం. మొదటి పది ర్యాంకుల్లో ఐదు ర్యాంకులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులే సొంతం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెదిన సూరజ్ కృష్ణ బోగి మొదటి ర్యాంక్ సాధించగా, విశాఖపట్నానికి చెందిన కెవిఆర్ హేమంత్ కుమార్ చొడిపిల్లి రెండో ర్యాంక్ సాధించాడు. తెలంగాణకు చెందిన గట్టు మైత్రేయ ఐదో ర్యాంక్ సాధించాడు. 

2018 జెఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. రాజస్థాన్ కు చెందిన పార్త్ లటూరియా మూడో ర్యాంక్, హర్యానాకు చెందిన ప్రణవ్ గోయల్ నాలుగో ర్యాంక్ సాధించారు. తొలి 15 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు ఏడుగురున్నారు. 

ఐఐటిల్లో, ఎన్ఐటీల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన జెఈఈ ఫలితాలు సోమవారం సాయంంత్రం ఆరున్నర గంటలకు విడుదలయ్యాయి. జెఈఈ మెయిన్ పరీక్షను 360 మార్కులకు నిర్వహించగా తెలుగు విద్యార్థులు ముగ్గురికి 350 మార్కుల చొప్పున వచ్చాయి. 

రాజస్థాన్ కు చెందిన పవన్ గోయల్ కు ఆరో ర్యాంక్, రాజస్థాన్ కే చెందిన భాస్కర్ అరుణ్ గుప్తాకు ఏడో ర్యాంక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డకారపు భరత్ కు 8వ ర్యాంక్, ఢిల్లీకి చెందిన సిమర్ ప్రీత్ సింగ్ సలూజకు 9 ర్యాంక్, తెలంగాణకు చెందిన గోసుల వినాయకకు పదో ర్యాంక్ దక్కాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios