ఎపి ఎక్స్ ప్రెస్ రైల్లో మంటలు: రెండు బోగీలు అగ్నికి ఆహుతి

2 Coaches Of Andhra Pradesh Super Fast Express Catches Fire Near Gwalior
Highlights

ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు మంటల్లో చిక్కుకుంది. రెండు కోచ్ లు దగ్ధమయ్యాయి.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు మంటల్లో చిక్కుకుంది. రెండు కోచ్ లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మరో బోగీకి మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

ప్రాణనష్టమేదీ జరగలేదని సమాచారం. ఎయిర్ కండీషన్ కోచ్ ల డోర్స్ నుంచి మటలు బయటకు రావడాన్ని ఒకతను గుర్తించాదు. బి6, బి7 కోచ్ లు మంటల్లో చిక్కుకున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. 

ఢిల్లీ నుంచి రైలు 6 గంటలకు బయలుదేరింది. హైటెన్షన్ వైర్లు తెగిపడడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. రెండు బోగీలను విడదీసి, ఆ బోగీల్లోని ప్రయాణికులను ఇతర బోగీలకు పంపించి, రైలును ముందుకు నడిపించినట్లు తెలుస్తోంది. రైలులో ఎక్కువగా తెలుగు ప్రయాణికులే ఉన్నారు. కొత్తగా రెండు బోగీలను రైలుకు జోడించినట్లు తెలుస్తోంది.

loader