తిరుమలకు తగ్గిన ఆదాయం, భక్తులు: నెల రోజుల్లో రెండున్నర లక్షల మంది దర్శనం

 నెల రోజుల్లో తిరుమల వెంకన్నను 2 లక్షల 49 వేల 369 మంది దర్శించుకొన్నారు. నెల రోజుల్లో శ్రీవారికి హుండీ ద్వారా రూ. 13.93 కోట్ల మేర ఆదాయం వచ్చింది. లాక్ డౌన్ ఆంక్షల సడలింపులో భాగంగా ఈ ఏడాది జూన్ 8వ తేదీ నుండి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.
 

2.50 lakh devotees visited Tirupati Lord Balaji temple in one month

తిరుపతి:  నెల రోజుల్లో తిరుమల వెంకన్నను 2 లక్షల 49 వేల 369 మంది దర్శించుకొన్నారు. నెల రోజుల్లో శ్రీవారికి హుండీ ద్వారా రూ. 13.93 కోట్ల మేర ఆదాయం వచ్చింది. లాక్ డౌన్ ఆంక్షల సడలింపులో భాగంగా ఈ ఏడాది జూన్ 8వ తేదీ నుండి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 20వ  తేదీ నుండి మే 7వ తేదీ వరకు భక్తులకు తిరుమలలో శ్రీవారి దర్శనం లేకుండా నిలిపివేశారు. కానీ, స్వామి వారికి ఏకాంత సేవలను కొనసాగించారు. 

మార్చి 20వ తేదీకి ముందు మాత్రం ప్రతి రోజూ తిరుపతి వెంకన్నను 80 వేల నుండి లక్ష మంది భక్తులు దర్శించుకొనేవారు. గత నెల 8వ తేదీ నుండి భక్తులకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించింది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి ఇచ్చారు. ప్రతి రోజూ కేవలం ఆరు వేల మందికి మాత్రమే దర్శనం కల్పించారు.

also read:జూలై 1 నుండి ప్రతి రోజూ 9 వేల మంది భక్తులకు వెంకన్న దర్శనం

ఈ నెల 1వ తేదీ నుండి ప్రతి రోజూ 9 వేల మంది భక్తులకు తిరుమలేశుడిని దర్శించుకొనే వెసులుబాటు కల్పించారు. జూన్ 8వ  తేదీన తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం చేసుకొనే వెసులుబాటు కల్పించారు. తిరుమలకు వచ్చిన భక్తుల్లో 66708 మంది తలనీలాలు సమర్పించారు. 

కరోనాకు ముందు  తిరుమల శ్రీవారికి ప్రతి నెల రూ. 200 నుండి రూ. 220 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ, ప్రస్తుతం నెల రోజులకు తిరుమలకు రూ. 13.93 కోట్ల ఆదాయం మాత్రమే  వచ్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios