Asianet News TeluguAsianet News Telugu

జూలై 1 నుండి ప్రతి రోజూ 9 వేల మంది భక్తులకు వెంకన్న దర్శనం

తిరుమల శ్రీవారి వెంకన్న దర్శనం కోసం చేసుకొనే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ప్రతి రోజూ  9 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకొనేందుకు టీటీడీ పాలకవర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రతి రోజూ ఆరు వేల మంది భక్తులు మాత్రమే స్వామిని దర్శించుకొంటున్నారు.

TTD decides to increase special quota tickets for the Darshans
Author
Tirupati, First Published Jun 29, 2020, 2:33 PM IST

తిరుపతి: తిరుమల శ్రీవారి వెంకన్న దర్శనం కోసం చేసుకొనే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ప్రతి రోజూ  9 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకొనేందుకు టీటీడీ పాలకవర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రతి రోజూ ఆరు వేల మంది భక్తులు మాత్రమే స్వామిని దర్శించుకొంటున్నారు.

తిరుమలలో స్వామివారిని దర్శించుకొనే భక్తుల సంఖ్యను మరో మూడు వేలకు పెంచింది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుండి ప్రతి రోజూ 9 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొనేందుకు వీలుగా టీటీడీ పాలకవర్గం టోకెన్లు జారీ చేయనుంది.

జూలై 1వ తేదీ నుండి రోజుకు 3 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నామని టీటీడీ ప్రకటించింది.తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్ల ద్వారా ఒకరోజు ముందుగా భక్తులు టికెట్లు పొందొచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక జులై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జులై 16న ఆణివార ఆస్థానం, జులై 30 నుంచి ఆగస్టు వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు.

ఈ నెల 11వ తేదీ నుండి సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించింది. లాక్ డౌన్ ఆంక్షల్లో మినహాయించడంతో టీటీడీ తన భక్తులకు దర్శనాన్ని కల్పిస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios