ఏపీలోనూ కరోనా విజృంభణ.. కొత్తగా 174 మందికి పాజిటివ్: 8,91,178కి చేరిన కేసులు
ఏపీలో ఇవాళ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. నిన్న మొన్నటి వరకు 100 లోపే వున్న కేసులు గురువారం బాగా పుంజుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 174 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రకటించింది
గత కొన్నిరోజులుగా దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్ విధించింది. మరోవైపు ఏపీలో ఇవాళ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.
నిన్న మొన్నటి వరకు 100 లోపే వున్న కేసులు గురువారం బాగా పుంజుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 174 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 8,91,178కి చేరింది.
కరోనా వల్ల నిన్న చిత్తూరు జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి రాష్ట్రంలో వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,179కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,158 మంది చికిత్స పొందుతున్నారు.
గడిచిన 24 గంటల్లో 78 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో డిశ్చార్జ్‌ల సంఖ్య 8,82,841కి చేరుకుంది. నిన్న 47,803 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఏపీలో మొత్తం టెస్టుల సంఖ్య 1,44,03,941కి చేరుకుంది.
గత 24 గంటల్లో అనంతపురం 6, చిత్తూరు 60, తూర్పుగోదావరి 11, గుంటూరు 12, కడప 5, కృష్ణ 26, కర్నూలు 8, నెల్లూరు 3, ప్రకాశం 7, శ్రీకాకుళం 7, విశాఖపట్నం 23, విజయనగరం 0, పశ్చిమ గోదావరిలలో 6 కేసులు చొప్పున నమోదయ్యాయి.