తిరుమల:తిరుమలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా గురువారం నాడు మరో ఏడుగురు అర్చకులకు కరోనా సోకింది. దీంతో కరోనా సోకిన అర్చకుల సంఖ్య 15కి చేరుకొంది.

తిరుపతి, తిరుమలలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల పెరిగిపోవడంపై టీటీడీ పాలకవర్గం ఆందోళన చెందుతోంది. 

బుధవారం నాడు నలుగురు అర్చకులకు కరోనా సోకింది. ఇవాళ ఏడుగురికి కరోనా సోకింది. ఈ పరిణామాలపై ఏం చేయాలనే విషయమై టీటీడీ పాలకవర్గం చర్చిస్తోంది.

అన్నమయ్య భవన్ లో టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులతో గురువారం నాడు చర్చిస్తున్నారు.ఈ సమావేశానికి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో పాటు అధికారులు కూడ హాజరయ్యారు. 

also read:తిరుమలలో కలకలం: నలుగురు అర్చకులకు కరోనా, అలిపిరి టెస్టింగ్ సెంటర్ మూసివేత

 కరోనా సోకిన అర్చకులను శ్రీనివాసం క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. అలిపిరి వద్ద ఉన్న కరోనా టెస్టింగ్ కేంద్రంలో డాక్టర్, ల్యాబ్ టెక్నీషీయన్ కు కూడ కరోనా సోకడంతో ఈ టెస్టింగ్ కేంద్రాన్ని బుధవారం నాడు అధికారులు మూసివేశారు. 

శానిటేషన్  చేసిన తర్వాత ఈ టెస్టింగ్ కేంద్రాన్ని అధికారులు గురువారం నాడు తెరిచారు. తిరుమల కొండపైకి వచ్చే భక్తులకు అలిపిరి వద్దే టెస్టులు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ టెస్టింగ్ కేంద్రాన్ని తెరిచారు.