13 ఏళ్ల దత్తపుత్రిక దాష్టీకం.. ప్రియుడితో తల్లిని కడతేర్చిన వైనం..
Rajamahendravaram: దత్తపుత్రిక దారుణంగా ప్రవర్తించింది. 13 ఏళ్లకే పెంపుడు కూతురు చెడు వ్యసనాల బారిన పడడంతో ఆ తల్లి మందలించింది. దీంతో తల్లి చెబుతున్న మాటలన్నీ తనపై ద్వేషంతోనే చెబుతున్నట్లుగా భావించిన బాలిక.. ప్రియుడుతో కలిసి హతమొందించింది.

Rajamahendravaram: ఆ దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. కోట్ల ఆస్తిపరులు.. కానీ పిల్లలు లేరు. దీంతో ఓ పేదింటి ఆడపిల్లను దత్తతకు తీసుకున్నారు. ఆ బాలికను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆ బాలిక.. ఏం కావాలని అడిగినా.. కాదు అనకుండా కొనిచ్చేవారు. ఈ అతి గారాబమే వారి పాలిట యమపాశమైంది. 13 ఏండ్ల పెంపుడు కూతురు చెడు వ్యసనాలకు అలవాటు పడింది. అడ్డుగా ఉన్న తల్లిని తన ప్రియుడు, స్నేహితులతో కలిసి హతమార్చింది. ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కంబాలపేటలో దారుణం చోటు చేసుకుంది.
అసలు ఏం జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం కంబాలపేటకు చెందిన మార్గరెట్ జులియాన, నాగేశ్వరరావు అనే దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. కోట్ల ఆస్తి ఉంది. కానీ, వారికి సంతానం లేరు. దీంతో వారు 13ఏళ్ల క్రితం పేదింటి చిన్నారిని దత్తత తీసుకుని అల్లరు ముందుగా పెంచుకుంటున్నారు. ఆ చిన్నారికి ఏం కావాలంటే. అది ఇచ్చేవారు. జులియాన భర్త నాగేశ్వరరావు గత రెండేళ్ల కిత్రం అనారోగ్యంతో మృతి చెందారు. జులియాన ప్రభుత్వ టీచర్ గా పనిచేసి.. విశ్రాంతి తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆమె తన 13ఏళ్ల దత్తత కుమార్తెతో కలిసి ఆమె కంబాలపేటలో నివాసం ఉంటుంది. చిన్నారిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంది. రూ.కోట్ల ఆస్తికి వారసురాలు కావడంతో ఆ చిన్నారి అడిగిందల్లా ఇచ్చేది. ఆమె పాలిట శాపంగా మారింది. 13 ఏళ్లకే చెడు వ్యసానాలకు అలవాటు పడింది. ఇష్టానుసారంగా పార్టీలంటూ డబ్బులు ఖర్చు చేసేది. ఈ క్రమంలో ఓ 19 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న తల్లి జులియానా.. తన కూతుర్ని తీవ్రంగా మందలించింది. దీంతో తల్లికూతుర్ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.
ఈ క్రమంలో తల్లి జులియానా బాత్ రూమ్ లో కాలుజారి పడిపోయింది. దీంతో ఆమె బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. ఇదే సరైనా సమయమని భావించిన ఆ బాలిక.. తన ప్రియుడితో కలిసి వ్యూహరచన చేసింది. మరో ఇద్దరు యువకుల సాయంతో జులియానాను హతమార్చింది.'' అని పోలీసులు వెల్లడించారు. తనకు ఏం తెలియనట్టు ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అసలు విషయం బయటపడింది.