కొత్తగా 10,526 మందికి పాజిటివ్ : ఏపీలో 4 లక్షల మార్క్ క్రాస్ చేసిన కరోనా
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ విజృంభణ కొనసాగుతూనే వుంది. వరుసగా మూడో రోజు రాష్ట్రంలో పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,526 మందికి పాజిటివ్‌గా తేలినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ విజృంభణ కొనసాగుతూనే వుంది. వరుసగా మూడో రోజు రాష్ట్రంలో పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,526 మందికి పాజిటివ్‌గా తేలినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,03,616కి చేరింది.
గత 24 గంటల్లో వైరస్ కారణంగా 81 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 3,714కి చేరుకుంది. అలాగే గడిచిన 24 గంటల్లో 8,463 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 3,03,711కి చేరుకున్నాయి.
నిన్న రాష్ట్రంలో 61,331 మంది శాంపిల్స్ పరీక్షించగా... మొత్తం టెస్టుల సంఖ్య 35,41,321కి చేరింది. కోవిడ్ కారణంగా చిత్తూరు జిల్లాలో 10, కడప 9, నెల్లూరు 8, ప్రకాశం 8, పశ్చిమ గోదావరి 8, తూర్పు గోదావరి 6, కర్నూలు 6, విశాఖపట్నం 6, అనంతపురం 5, కృష్ణ 5, శ్రీకాకుళం 5, గుంటూరు 4, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
మరోవైపు నిన్న ఒక్కరోజే అనంతపురం జిల్లాలో 833, చిత్తూరు 819, తూర్పుగోదావరి 1,178, గుంటూరు 801, కడప 501, కృష్ణ 414, కర్నూలు 757, నెల్లూరు 1,151, ప్రకాశం 874, శ్రీకాకుళం 764, విశాఖపట్నం 896, విజయనగరం 552, పశ్చిమ గోదావరిలలో 986 కేసులు నమోదయ్యాయి.