కరోనాను జయించిన 102 ఏళ్ల బామ్మ: సీక్రెట్ ఇదీ....
కరోనా సోకిన 102 ఏళ్ల వృద్దురాలు కోలుకొన్నారు. ఏపీ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన 102 ఏళ్ల సుబ్బమ్మ అనే మహిళ కరోనాను జయించారు. కరోనా నుండి కోలుకొని ఆమె ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకొన్నారు. దీంతో కుటుంబసభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం: కరోనా సోకిన 102 ఏళ్ల వృద్దురాలు కోలుకొన్నారు. ఏపీ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన 102 ఏళ్ల సుబ్బమ్మ అనే మహిళ కరోనాను జయించారు. కరోనా నుండి కోలుకొని ఆమె ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకొన్నారు. దీంతో కుటుంబసభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి మండలం కమ్మవారిపల్లెకు చెందిన ముమ్మనేని సుబ్బమ్మకు 102 ఏళ్లు. ఆమెకు ఇటీవల కరోనా లక్షణాలు కలన్పించడంతో కుటుంబసభ్యులు ఆమెకు కరోనా పరీక్షలు చేయించారు. దీంతో ఆమెకు కరోనా ఉన్నట్టుగా తేలింది. దీంతో ఈ ఏడాది ఆగష్టు 21న ఆమెకు కరోనా ఉన్నట్టుగా తేలింది.
సుబ్బమ్మతో పాటు ఆమె కొడుకు, కోడలు, మనమడికి కూడ కరోనా కూడ ఉన్నట్టుగా వైద్యులు నిర్ధారించారు. వృద్దురాలి కొడుకుకు డయాబెటిస్ ఉంది. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారు. వృద్దురాలితో పాటు కోడలు, మనువడు ఇంట్లోనే ఉండి కరోనాకు చికిత్స తీసుకొన్నారు.
వైద్యులు సూచించినట్టుగా ఆమె మందులు వాడింది.దీంతో ఆమె కరోనా నుండి కోలుకొంది. ప్రతి రోజూ రాగి ముద్ద, బత్తాయి రసం, చికెన్ తో పాటు నాన్ వెజ్ తినడంతో ఆమె కరోనాను జయించారు. కరోనా బారిన పడిన ఆ కుటుంబాన్ని పలువురు పరామర్శించారు.
గతంలో కర్నూల్ జిల్లాకు చెందిన శతాధిక వృద్ధురాలు కూడ కరోనా ను జయించారు. కరోనా సోకిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత కోలుకొన్నారు.