మారుతల్లిపై కోపంతో అర్ధనగ్నంగా పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేసాడు ఓ పదేళ్ల బాలుడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది.
ఏలూరు : స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్ళడానికి ఆ బాలుడు రెడీ అవుతున్నాడు. తెల్లటి చొక్కా వేసుకుని అందంగా రెడీ అయి భర్త్ డే వేడుకల్లో పాల్గొనాలని భావించాడు. స్నానం చేసి రెడీ అవుతూ చొక్కా ఇవ్వాలని తల్లిని అడిగాడు. అయితే బయటకు వెళ్లడం ఇష్టంలేని తల్లి చొక్కా ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో చిర్రెత్తిపోయిన బాలుడు ఒంటిపై కేవలం టవల్ తోనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి తల్లిపై ఫిర్యాదు చేసాడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ఏలూరు పట్టణంలోని కొత్తపేటలో పదేళ్ల సాయి దినేష్ తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. నాలుగో తరగతి పూర్తిచేసిన అతడు ఐదో తరగతిలోకి వెళుతున్నాడు. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ కావడంతో దినేష్ తో పాటు సోదరి కూడా ఇంటివద్దే వుంటున్నారు.
రెండేళ్లక్రితం దినేష్ తల్లి అనారోగ్యంతో మృతిచెందండంతో తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం దినేష్ తో పాటు సోదరి ఆలనాపాలనా మారుతల్లి చూసుకుంటోంది. ఇలా నిన్న(ఆదివారం) కూడా దినేష్ తల్లివద్దే వున్నాడు.
Read More కాకినాడ జిల్లా: ఆటోను ఢీకొన్న ప్రైవేట్ బస్సు .. ఆరుగురు మహిళలు దుర్మరణం
అయితే రోజంతా ఇంట్లోనే వున్న దినేష్ సాయంత్రం స్నేహితుడి పుట్టినరోజు వుండటంతో బయటకు వెళ్లడానికి సిద్దమయ్యాడు. స్నానం చేసి టవల్ కట్టుకుని బాత్రూంలోంచి బయటకు వచ్చిన బాలుడు చొక్కా ఇవ్వాలని తల్లిని అడిగాడు. బయటకు వెళ్లొద్దని చెప్పిన తల్లి చొక్కా ఇవ్వడానికి నిరాకరించింది. ఆమె మాటలు వినకుండా మారాం చేస్తున్న దినేష్ ను కొట్టింది. దీంతో బాలుడు ఏడుస్తూ అలాగే అర్ధనగ్నంగా నడుచుకుంటూ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తల్లిపై ఫిర్యాదు చేసాడు.
అయితే దినేష్ నుండి తల్లిదండ్రుల వివరాలు సేకరించిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు తల్లిదండ్రుల మాట విని బుద్దిగా చదువుకోవాలని బాలుడికి సూచించారు. అనంతరం దినేష్ ను తల్లిదండ్రులకు అప్పగించారు.
గతంలోనూ దినేష్ ను చిత్రహింసలు పెడుతోందంటూ మారుతల్లిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. చిన్న పిల్లాడికి వాతలుపెట్టిన మారుతల్లి టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. తాజాగా మరోసారి ఈ తల్లీ కొడుకుల వ్యవహారం పోలీసులవద్దకు చేరింది.
