కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ వద్ద ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తాళ్లరేవు బైపాస్ వద్ద ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన ఆరుగురు మహిళలే కావడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.