Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో వరదల ధాటికి 10మంది మృతి.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

కృష్ణా నది కూడా పొంగిపొర్లుతోంది. దీంతో ప్ర‌కాశం బ్యారేజీ నుంచి 6.46 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో కృష్ణా న‌దికి కుడి, ఎడ‌మ ప్రాంతాల్లోని ఆవాస ప్రాంతాలు నీట మునిగే అవ‌కాశం ఉండ‌టంతో అధికారులు రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక‌ జారీ చేశారు.

10 People Died Due to Heavy Rains Floods In AP
Author
Hyderabad, First Published Oct 14, 2020, 6:41 PM IST

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి.  భారీ వర్షాలకు వరదలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్ నగరం మొత్తం పూర్తిగా నీట మునిగిపోయింది. ఆాంధ్రప్రదేశ్ లోనూ వరదలు పొంగిపొర్లుతున్నాయి. వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉంది. దీంతో.. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. రహదారులన్నీ జలమయమయ్యాయి.

కృష్ణా నది కూడా పొంగిపొర్లుతోంది. దీంతో ప్ర‌కాశం బ్యారేజీ నుంచి 6.46 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో కృష్ణా న‌దికి కుడి, ఎడ‌మ ప్రాంతాల్లోని ఆవాస ప్రాంతాలు నీట మునిగే అవ‌కాశం ఉండ‌టంతో అధికారులు రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక‌ జారీ చేశారు.

ఇదిలా ఉండగా.. ఈ వరదల కారణంగా ఏపీలో ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో.. భారీ వర్షాలు, వరదలపై ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఉన్న‌త‌స్థాయి స‌మావేశం ఏర్పాటు చేసి ప‌రిస్థితిని స‌మీక్షించారు. జిల్లా కలెక్ట‌ర్‌లు, ఇత‌ర‌ అధికారులు, పోలీసులు అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం వైఎస్ జగన్ సూచించారు. కాగా, రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల కారణంగా ఇప్ప‌టివ‌ర‌కు 10 మంది మృతిచెందిన‌ట్లు ఏపీ సీఎం కార్యాల‌యం వెల్ల‌డించింది. మృతులంద‌రికీ ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించార‌ని ఏపీ సీఎంవో తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios