చిత్తూరు:అడవిలో అదృశ్యమైన బ్యాంక్ ఉద్యోగులు క్షేమంగా ఉన్నారని సమాచారం అందడంతో కుటుంబసభ్యులు  ఊపిరి పీల్చుకొన్నారు.

చిత్తూరు జిల్లాలోని సదాశివకోన జలపాతానికి నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన బ్యాంకు ఉద్యోగులు విహార యాత్రకు వెళ్లారు.ఆదివారం నుండి వారి ఫోన్ సిగ్నల్స్ కనెక్ట్ కాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

ఈ విషయం పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆదారంగా పోలీసులు అడవిలోకి వెళ్లారు. ఇవాళ అడవిలోని శివాలయంలో స్వామిని దర్శించుకోవాలనుకొన్నారు. అడవిలో ట్రెక్కింగ్ చేసి అలసిపోవడంతో అడవి నుండి బయటకు రావడానికి ట్రాక్టర్ ను మాట్లాడుకొన్నారు.

also read:చిత్తూరులో విహారయాత్రకు వెళ్లిన 10 మంది బ్యాంకు ఉద్యోగులు మిస్సింగ్: కుటుంబ సభ్యుల ఆందోళన

అయితే వారి వద్దకు ట్రాక్టర్ రావడానికి ఆలస్యమైంది. వీరున్న ప్రాంతంలో ఫోన్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. ట్రాక్టర్ లో తిరుపతి వడమాలపేటకు వెళ్దుండగా పోలీసులు వారిని గుర్తించారు.

ఆదివారం నుండి బ్యాంకు ఉద్యోగుల  ఫోన్లు కనెక్ట్ కాలేదు. దీంతో ఉద్యోగుల కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు డవిలోకిి వెళ్లారు.