చిత్తూరు జిల్లాలో విహార యాత్రకు వెళ్లిన 10 మంది బ్యాంకు ఉద్యోగులు అదృశ్యమయ్యారు. వారి కోసం కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 10 మంది ఫోన్లు పనిచేయడం లేదు.

సదాశివకోన జలపాతానికి విహారయాత్రకు వెళ్లారు ఉద్యోగులు. నిన్నటి నుండి ఉద్యోగుల ఫోన్లు స్విచ్ఛాప్ వస్తున్నాయని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

విహార యాత్ర కోసం బ్యాంకు ఉద్యోగులంతా సరదాగా వెళ్లారు. ఆదివారం నాడు సెలవు కావడంతో సహచర ఉద్యోగులంతా కలిసి టూర్ కు ప్లాన్ చేసుకొన్నారు. టూర్ కు వెళ్లిన ఉద్యోగుల నుండి సమాచారం లేదు. ఒక్కసారిగా అందరి ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఒకేసారి అందరి ఫోన్లు ఎందుకు పనిచేయడం లేదనే ఆందోళన బ్యాంకు ఉద్యోగుల కుటుంబాల్లో నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ విషయమై పోలీసులు బ్యాంకు ఉద్యోగుల కోసం ఆరా తీస్తున్నారు.

విహారయాత్రకు వెళ్లిన బ్యాంకు ఉద్యోగులు ఏమయ్యారనే విషయమై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.