అమరావతి:రూ. 5లక్షల ఆదాయం ఉన్నవారికి కూడ ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.రూ. కోటి 42 లక్షల కుటుంబాలు ఆరోగ్య శ్రీ పథకంలోకి తీసుకొచ్చామన్నారు.

శుక్రవారం నాడు మన పాలన- మీ సూచనలు అనే కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ మేథో మధనం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 క్యాన్సర్ రోగులకు కూడ ఆరోగ్య శ్రీని వర్తింపు చేస్తామని సీఎం తెలిపారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయాలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపు చేస్తామన్నారు. రెండు వేలకు పైగా జబ్బులకు ఆరోగ్య శ్రీని వర్తింపజేయనున్నట్టుగా సీఎం తెలిపారు.హైద్రాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాల్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని సీఎం చెప్పారు.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి  పెన్షన్లు ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో ప్రభుత్వాసుపత్రుల్లో మందులు తీసుకోవాలంటే ప్రజలు భయపడేవారు. కానీ, ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో మందులు ఇస్తున్నట్టుగా చెప్పారు.

మందుల సంఖ్యను 230 నుండి 500కి పెంచామన్నారు. వైద్యం కోసం పేదవాడు అప్పులపాటు కాకూడదని వైఎస్ఆర్ ఆలోచించేవాడని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందుకే ఆరోగ్య శ్రీ తీసుకొచ్చారన్నారు. కానీ గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిందని ఆయన విమర్శించారు.

రూ. 5లక్షల ఆదాయం ఉన్నవారికి కూడ ఆరోగ్యశ్రీ వర్తించనున్నట్టుగా సీఎం చెప్పారు.రూ. కోటి 42 లక్షల కుటుంబాలు ఆరోగ్య శ్రీ పథకంలోకి తీసుకొచ్చామన్నారు. క్యాన్సర్ రోగులకు కూడ ఆరోగ్య శ్రీని వర్తింపు చేస్తామని సీఎం తెలిపారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయాలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపు చేస్తామన్నారు. రెండు వేలకు పైగా జబ్బులకు ఆరోగ్య శ్రీని వర్తింపజేయనున్నట్టుగా సీఎం తెలిపారు.

also read:ప్రత్యేక హోదా వదలం, మన అవసరం వస్తుంది: వైఎస్ జగన్
 108, 104 కొత్త వాహనాలను 1060 కొత్తగా జూలైలో ప్రారంభిస్తున్నామన్నారు. ఈ వాహనాలను ఆయా జిల్లాలకు పంపుతామన్నారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ లను ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజలకు ఎఎన్ఎం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన తెలిపారు. పీహెచ్ సీల రూపురేఖలను మారుస్తామన్నారు.

నెల రోజుల్లో 9712 కొత్త డాక్టరు పోస్టులను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. కరోనా సమయంలో యుద్ధం వస్తే ఎలా పనిచేస్తామో.. అలా వైద్య సిబ్బంది పనిచేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు.