లాక్ డౌన్.. షాక్ డౌన్.. మోత మోగిస్తున్న కరెంటు బిల్లులు..

Jun 10, 2020, 4:51 PM IST

తెలంగాణలో కరెంటు బిల్లులు.. హార్ట్ స్ట్రోక్ కంటే ఎక్కువైన పవర్ స్ట్రోక్స్ ఇస్తున్నాయి. కరోనా కారణంగా, ఏప్రిల్, మే నెలల్లో కరెంటు బిల్లులలు తీయలేదు. గతేడాదివే కట్టమన్నారు. ఇది తెలిసిన విషయమే అయితే ఇప్పుడు జూన్ లో ఈ మూడు నెలల బిల్లు మాన్యువల్ గా తీయడం, స్లాబ్ ల్లో తేడాలు... కారణం ఏదైనా మధ్యతరగతి నెత్తిమీద కరెంటు పిడుగు పడింది. మూసిఉన్న షాపులకు ముప్పైవేల బిల్లు.. షాపు అమ్మేసుకోవాలంటూ ఆవేదన చెందుతున్నారు కరెంటు వినియోగదారులు.