Jan 28, 2022, 3:27 PM IST
హైదరాబాద్: ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఓయూలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటుచేసారు. ఈ క్రికెట్ ఫోటీలను ప్రారంభించేందుకు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓయూకు రావాల్సివుంది. అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో టీఆరఎస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంతో వున్న ఓయూ విద్యార్థులు వీరిని అడ్డుకునేందుకు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే నరేష్ యాదవ్ అనే విద్యార్థి పెట్రోల్ బాటిల్ తో ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళనకు దిగాడు. టీఆర్ఎస్ నాయకులు క్యాంపస్ లోకి అడుగుపెడితే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని నరేష్ హెచ్చరించారు. అతడిని పోలీసులు అడ్డుకున్నారు.