ఈ పాపం ఎవరిది : చెరువులను మింగేసిన హైదరాబాద్

Oct 16, 2020, 1:56 PM IST

చినుకు పడితే చాలు హైదరాబాద్ సముద్రంలా మారిపోతుంది. ఇళ్లు, అపార్ట్ మెంట్లు స్విమ్మింగ్ పూల్స్ అవుతున్నాయి. కాలు బయటపెట్టలేని పరిస్థితి. రోడ్లు వాగుల్ని తలపిస్తున్నాయి. అప్పటివరకు నడిచిన వీధులే వరదల్లో మనుషుల్ని గల్లంతు చేస్తున్నాయి. మొసళ్లు, కొండచిలువలు, పాములు.. ఆ నీళ్లలో టెర్రర్ పుట్టిస్తున్నాయి. కార్లు పడవలవుతున్నాయి.. హైదరాబాద్ లో పడవలేసుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి కారణం ఏంటీ.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందీ అంటే.. ఒక్కసారి హైదరాబాద్ నగర నిర్మాణాన్ని పరిశీలించాలి. ఇక్కడ పరిఢవిల్లిన చెరువుల సంస్కృతి గురించి తెలియాలి.. అభివృద్ధి పేరుతో చెరువుల్లోకి చొచ్చుకు పోయిన హైదరాబాద్ గురించి తెలియాలి..