అడ్వకేట్ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

May 21, 2020, 3:16 PM IST

కరీంనగర్లోని కశ్మీర్ గడ్డ ప్రాంతంలో నివాసముండే అడ్వకేట్ పెరిక శ్రీనివాస్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదం కారణంగా భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్ కు కాల్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.  వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పేలుడు కారణంగా శ్రీనివాస్ ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సిలిండర్ పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదు.