Aug 21, 2020, 7:28 PM IST
శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. గత రాత్రి జరిగిన ప్రమాదంలో ఈ 9 మంది లోపల చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. సహాయక చర్యలు చేపట్టినప్పటికీ వారిని కాపాడలేకపోయారు.
తొమ్మిది మంది మరణించిన విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం సమయంలో లోపల 17 మంది చిక్కుకున్నారు.
ప్రమాదంలో మరణించిన అసిస్టెంట్ ఇంజనీర్ సుందర్ నాయక్ కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇటీవలే విధుల్లో చేరారు. మరో అసిస్టెంట్ ఇంజనీరు మోహన్ కుమార్ తన సహోద్యోగులను కాపాడే ప్రయత్నం చేశారు.
ఐదు నిమిషాల్లో తాను మరణిస్తున్నానని, తన వద్దకు ఎవరూ రావద్దని ఆయన మోహన్ కుమార్ అన్నట్లు తెలుస్తోంది. లోపల చిక్కుకున్నవారంతా మరణించినట్లు తెలుస్తోంది.