ఉప్పు నీటితో ముఖం కడుక్కుంటే ఏమౌతుంది?

First Published | Dec 14, 2024, 11:56 AM IST


ఉప్పు నీటిలో ఉండే లవణాలు చర్మంపై మురికిని , నూనెలను తొలగిచడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. మరి, ఈ ఉప్పు నీటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం…
 


మనమందరం సహజంగా ప్రతి దానికీ మంచినీరే వాడుతూ ఉంటాం. ముఖ్యంగా స్నానానికి కచ్చితంగా మంచినీరే వాడతారు. కానీ.. ఉప్పు నీటితో ముఖం కడగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ రోజుల్లో ఎవరూ ఉప్పు నీటిని వాడటం మానేశారు. కానీ ఈజీప్టు వంటి ప్రాంతాల్లో పూర్వం చర్మ సంరక్షణకు ఉప్పునీరే వాడేవారట. ఉప్పు నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకపోవడం దగ్గర నుంచి…  డెడ్ స్కిన్ తొలగించడంలోనూ సహాయం చేస్తుందట. దీని వల్ల చర్మం మృదువుగా మారి, కాంతివంతంతగా కనపడుతుందట. ఉప్పు నీటిలో ఉండే లవణాలు చర్మంపై మురికిని , నూనెలను తొలగిచడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. మరి, ఈ ఉప్పు నీటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం…


మీ ఇంట్లో ట్యాప్ నీటిని రెండు కప్పులు తీసుకోవాలి.  ఆ నీటిలో ఒక టీ స్పూన్ సముద్రపు ఉప్పు వేయాలి. ఉప్పు కరిగే వరకు నీటిని మరిగించాలి. ఆ నీరు చల్లారిన తర్వాత  మీరు ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు.  ఫేష్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత.. ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. 
 

Tap to resize


మీ ముఖాన్ని ఉప్పు నీటితో కడగడం వల్ల కలిగే ప్రయోజనాలు

మీ ముఖాన్ని ఉప్పునీటితో కడగడం ద్వారా, అందులో ఉండే అయోడిన్, జింక్, పొటాషియం ముఖం పై పేర్కొన్న  మురికి, బ్లాక్ హెడ్స్ , మృతకణాలను తొలగించడానికి ఉపయోగపడతాయి.

ఉప్పు నీరు ఒక అద్భుతమైన క్రిమినాశకంగా పనిచేస్తుంది, మొటిమలు ,అవాంఛిత మచ్చలను తొలగిస్తుంది. దీన్ని రోజుకు రెండుసార్లు ఉపయోగించడం వల్ల ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కొద్ది రోజుల్లోనే ముఖానికి ప్రకాశవంతమైన రూపాన్ని ఇస్తుంది.

మీ ముఖం మీద మచ్చలు ఉంటే, ఉప్పు నీటితో మీ ముఖం కడుక్కోవడం వలన అవి అదృశ్యమవుతాయి.
 


ఉప్పు నీటిని ఎక్కువగా ఉపయోగించవద్దు.

మీరు ఉప్పు నీటితో మీ ముఖాన్ని కడగడానికి ప్రయత్నించాలనుకుంటే, దానిని ఎక్కువగా ఉపయోగించకుండా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది పొడి, దెబ్బతిన్న చర్మానికి దారితీస్తుంది. వారానికి రెండు సార్లుకు మించి ఎక్కువగా వాడకూడదు. 

Latest Videos

click me!