Aug 11, 2020, 1:36 PM IST
కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుండి వైద్య వృత్తిలో వున్న వారందరు వారి ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలను కాపాడడానికి నిరంతరం కష్ట పడుతున్నారు . దేవుడు ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని కాపాడే పోరాట యోధులుగా నిలుస్తున్నారు. పిల్లాపాపాలను ,కుటుంబాలను రోజులు ,నెలలు వదిలి కరోనా ఫై యుద్ధం చేస్తున్నారు ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్. తమ ఫై నమ్మకం పెట్టుకొని వచ్చిన ప్రజలను కాపాడడానికి వాళ్ళు ఎంతగా కష్టపడుతున్నారో కొన్ని సంఘటనలు చూస్తేనే అర్ధం అవుతుంది . సూరారం లోని మల్టీ స్పెషలిటీ హాస్పిటల్లో కోవిడ్ వింగ్ ఇంచార్జి నర్స్ గ పనిచేసిన సిజి స్టీఫెన్ నెలరోజులు ఇంటికి వెళ్ళలేదు , ఆ తరువాత ఇంటికి వెళితే ఆ చిన్నారులు తల్లిని ఎంతలా మిస్ అవుతున్నారో ఈ వీడియో చుస్తే అర్ధం అవుతుంది