ఐసోలేషన్ వార్డ్ నుండి పరారైన కరోనా పాజిటివ్ వ్యక్తి.. మరో వ్యక్తితో ప్రత్యక్షం..

Jul 21, 2020, 12:22 PM IST

రాజన్న సిరిసిల్లలోని జిల్లా ప్రధాన ఏరియా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డ్ నుండి కరోనా పాజిటివ్ వ్యక్తి పారిపోవడం కలకలం రేపింది. వేములవాడ మండలానికి చెందిన ఓ వ్యక్తిని గత రాత్రి జిల్లా ప్రదాన ఆసుపత్రికి వైద్యాధికారులు తరలించారు. అయితే కరోనా వార్డులో ఉంచిన ఆ వ్యక్తి ఉదయం కనపడపోయేసరికి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సుందరయ్య నగరులో ఆ వ్యక్తిని, అతనితో పాటు అగ్రహారానికి చెందిన మరొక వ్యక్తిని పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని తిరిగి ఐసోలేషన్ కు తరలించారు. అయితే  అంబుల్లెన్స్ వచ్చేవరకు వారికి కావాల్సిన భోజనం, మంచినీటిని పోలీసులే దగ్గరుండి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.