మహిళా ప్లేయర్స్‌పై కనక వర్షం.. అత్యధికంగా రూ. 1.90 కోట్లు.. ఏ జట్టులో ఎవరంటే..

First Published | Dec 15, 2024, 7:47 PM IST

WPL Auction: ఇటీవల జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలో మెన్‌ క్రికెటర్లపై కనకవర్షం కురిసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మహిళల వంతు వచ్చేసింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌లో భాగంగా ఆదివారం మినీ వేలాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పలు ప్లేయర్స్‌పై కనకవర్షం కురిపించారు. ఇంతకీ వేలంలో ఎవరు అత్యధిక ధరకు పలికారు.? ఏ జట్టులో ఎవరు చోటు దక్కించుకున్నారు.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

భారీ ధరకు సిమ్రాన్‌..

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌కు సంబంధించి ఆదివారం నిర్వహించిన మినీ వేలం ముగిసింది. వేలంలో అత్యధికంగా సిమ్రాన్‌ షేక్‌ భారీ ధర పలికింది. గుజరాత్‌ జెయింట్స్‌ ఆమెను ఏకంగా రూ. 1.90 కోట్లతో దక్కించుకుంది. సిమ్రాన్‌ రూ. 10 లక్షల బేస్‌ ప్రైజ్‌తో వేలంలోకి రాగా సిమ్రాన్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్ జెయింట్స్‌ పోటీపడ్డాయి. చివరగా గుజరాత్‌ జెయింట్స్‌ దక్కించుకుంది. 

ఎవరీ కమిలిని..

ఇక అత్యధిక ధర పలికిన జాబితాలో తర్వాత స్థానంలో జి. కమిలిని నిలిచింది. తమిళనాడుకు చెందిన ఈ పదహారేళ్ల ప్లేయర్‌ని ముంబై ఇండియన్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ కేటగిరీలో ఉన్న ఈ ఆల్‌రౌండర్‌ను ఏకంగా రూ. 1.60 కోట్లకు కొనుగోలు చేసింది. ఈమె కోసం ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు కమలినిని ముంబయి రూ.1.60 కోట్లకు దక్కించుకుంది. ఈమె అండర్‌-19 మహిళల టీ20 ట్రోఫీలో ఎనిమిది మ్యాచ్‌ల్లో 311 పరుగులు సెకండ్ టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. పార్ట్‌ టైమ్ స్పిన్నర్‌గానూ రాణించింది. 
 

Tap to resize

ఏ జట్టులో ఎవరున్నారంటే..

* గుజరాత్‌ జెయింట్స్‌ సిమ్రాన్ షేక్ - రూ. 1.90 కోట్లకు, డియాండ్రా డాటిన్ - రూ. 1.70 కోట్లకు, డేనియల్ గిబ్సన్ - రూ. 30 లక్షలు , ప్రకాశిక నాయక్ - రూ. 10 లక్షలకు సొంతం చేసుకున్నారు. 

* ముంబయి ఇండియన్స్‌ జి కమలిని - రూ. 1.60 కోట్లు, నాడిన్ డి క్లర్క్ - రూ. 30 లక్షలు, అక్షితా మహేశ్వరి - రూ. 20 లక్షలు, సంస్కృతి గుప్తా - రూ.10 లక్షలకు సొంతం చేసుకుంది. 

* ఇక యూపీ వారియర్స్‌ విషయానికొస్తే.. అలానా కింగ్ - రూ.30 లక్షలు, అరుషి గోయెల్ - రూ.10 లక్షలు , క్రాంతి గౌడ్- రూ.10 లక్షలకు దక్కించుకున్నారు. 

* ఢిల్లీ క్యాపిటల్స్‌ ఎన్.చరణి - రూ. 55 లక్షలు, నందిని కశ్యప్ - రూ.10 లక్షలు, సారా బ్రైస్ - రూ.10 లక్షలు, నికి ప్రసాద్ - రూ. 10 లక్షలకు సొంతం చేసుకున్నారు. 

* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికొస్తే జోషిత - రూ.10 లక్షలు, రాఘవి బిస్త్ - రూ.10 లక్షలు, జాగ్రవి పవార్ - రూ.10 లక్షలు , ప్రేమ రావత్ - రూ. 1.20 కోట్లకు దక్కించుకున్నారు. 
 

Latest Videos

click me!