పదవి విరమణ తర్వాత బిందాస్‌గా.. నెలకు రూ. 12 వేల పెన్షన్‌ పొందేలా.. బెస్ట్‌ స్కీమ్‌..

First Published | Dec 15, 2024, 6:49 PM IST

Pension Scheme: ఒకప్పుడు ఖర్చు చేయగా మిగిలిన దాన్ని పొదుపు చేసే వారు. కానీ ప్రస్తుతం పొదుపు చేసిన తర్వాతే ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక క్రమ శిక్షణపై ప్రజల్లో వచ్చిన మార్పునకు ఇది ఉదాహరణగా చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా పదవి విరమణ తర్వాత బిందాస్‌గా ఉండేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అలాంటి వారి కోసమే ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ ఒక మంచి పథకాన్ని అందిస్తోంది.. 
 

ప్రస్తుతం ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచే రిటైర్‌మెంట్‌ గురించి ఆలోచిస్తోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ప్రైవేట్‌ ఉద్యోగులు తమ ఆర్థిక పరిస్థితి కోసం ఆందోళన చెందుతున్నారు. పదవి విరమణ తర్వాత కూడా నెల ఖర్చులకు సరిపోయేలా డబ్బులు రావాలని ఆశిస్తున్నారు. ఇందుకోసం బ్యాంకులతో పాటు పలు సంస్థలు ఎన్నో రకాల పెన్షన్‌ పథకాలను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే లైఫ్‌ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ ఒక మంచి పథకాన్ని అందిస్తోంది. ఎల్‌ఐసీ సరల్‌ పెన్షన్‌ పేరుతో అందిస్తోన్న ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పదవి విరమణ తర్వాత నెలకు రూ. 12 వేల పెన్షన్‌ పొందేలా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఎల్‌ఐసీ సరల్ పెన్షన్‌ ప్లాన్‌ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్‌ రిటైర్మెంట్‌ ప్లాన్స్‌లో ఒకటి. ఈ పథకంలో చేరాలనుకునే వారు ఒకసారి మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అనంతరం పదవి విరమణ తర్వాత నెలవారీ పెన్షన్‌ పొందొచ్చు. అయితే ఈ పథకంలో చేరే వారు కచ్చితంగా 40 ఏళ్లు నిండి ఉండాలి. 40 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు అర్హులు. 
 

Tap to resize

ఈ పాలసీలో చేరాలంటే యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మూడు నెలలకు గాను కనీసం రూ. 3000, ఆఫ్‌ ఇయర్‌కి రూ. 6000, అలాగే ఏడాదికి అయితే రూ. 12,000 చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు పరిమితి అంటూ ఏం లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. మీరు ఎంత పెట్టుబడి పెడుతారన్న దాని ప్రకారం మీకు వచ్చే పెన్షన్‌ ఆధారపడి ఉంటుంది. 
 

నెలకు రూ. 12 వేల పెన్షన్‌ రావాలంటే..

ఉదాహరణకు మీకు నెలకు రూ. 12 వేల పెన్షన్‌ రావాలనుకుంటే. మీరు ఒకేసారి రూ. 30 లక్షలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇలా పెట్టుబడి పెడితే మీరు పదవి విరమణ తర్వాత 80 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ. 12,38గా పెన్షన్‌గా పొందుతారు. ఇక పాలసీ తీసుకున్న వ్యక్తి ఒకవేళ అకాల మరణం పొందితే డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని నామినీకి అందిస్తారు. ఒకవేళ మీరు పాలసీ తీసుకున్న తర్వాత నచ్చకపోతే ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా సరెండర్‌ చేయొచ్చు, మీ డబ్బులు మీకు చెల్లిస్తారు. ఇక ఇందులో జాయింట్ అకౌంట్‌ కూడా తీసుకునే అవకాశం ఉంది. భార్యభర్తలో ఎవరైనా చనిపోతే మరొకరికి పెన్షన్‌ ఇస్తారు. 
 

Latest Videos

click me!