అల్లు అర్జున్ పుష్ప3 లో.. రష్మిక మందన్న ప్రియుడు, ఐకాన్ స్టార్ కు రౌడీ హీరో పోటీ ఇస్తాడా..?

First Published | Dec 15, 2024, 4:59 PM IST

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది పుష్ప2 సినిమా. 6 రోజుల్లోనే 1000కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీకి మరో సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్ లో రౌడీ హీరో నటించబోతున్నాడట. ఈ వార్తల్లో నిజం ఎంత..? 
 

పుష్ప 2 సినిమా దేశ వ్యాప్తంగా పెను ప్రభంజనం సృష్టించింది.  ఇప్పటికీ భారీ కలెక్షన్స్ తో  ముందుకు దూసుకెళ్తోంది. అల్లు అర్జున్ తన నట విశ్వరూపానికి నిదర్శనంగా నిలిచింది ఈసినిమా. ఈమూవీలో అంత మంది పెద్ద నటులు ఉన్నా.. అంత బాగా నటించినా.. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షోతో  ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చాయని చెప్పవచ్చు. టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభ కు బన్నీ అద్భుతమైన నటన తోడై పుష్ప2 దరూల్ రిజల్ట్ అనుకున్నదానికంటే ఎక్కవే వచ్చింది. 

మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ జాతర ఎపిసోడ్ అయితే.. పూనకాలు తెప్పించి ఆడియన్స్ కు గూస్ బామ్స్ వచ్చేలా చేసింది. ఇక జాతర డాన్స్, జాతర ఫైట్ తో పాటు..క్లైమాక్స్ ఫైట్.. దానికి తగ్గట్టు ఆర్ఆర్ అద్భుతంగా కుదిరాయి. ఈ దెబ్బకు ఈసినిమాకు మరికొన్ని నేషనల్ అవార్డ్స్ ఖాయం అంటున్నారు జనాలు.

అంతే కాదు ఈ సినిమాలో బన్నీ పెర్ఫామెన్స్ కు మరోసారి జాతీయ అవార్డ్ ఖాయం అంటున్నారు. ఈక్రమంలో పుష్ప2 తో పాటు పుష్ప3 గురించి కూడా పెద్ద చర్చ జరుగుతోంది. పుష్ప3 ద రాంపేజ్ ఎలా ఉండబోతోంది అనే విషయంలో అంతా ఉత్కంఠ గా ఉన్నారు. 
 

Tap to resize

మరీ ముఖ్యంగా పుష్ప2 క్లైమాక్స్ లో బాంబ్ పేల్చింది ఎవరు..?  పుష్ప 3 ర్యాంపేజ్ లో మరో స్టార్ ను చూపించబోతున్నారు అని ఓ పెద్ద చర్చ జరుగుతోంది. అయితే పుష్ప3 లో కనిపించబోయేది ఎవరో కాదు... టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని గట్టిగా టాక్ నడుస్తోంది.

ఈసినిమాలో ఆయన పవర్ ఫుల్ విలన్ గా కనిపించే అవకాశం ఉన్నట్టు టాక్.  గత కొంత కాలంగా రష్మిక మందన్నకు విజయ్ దేవరకొండకు మధ్యలో సమ్ థింగ్ సమ్ థింగ్ అన్న వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. 
 

ఈక్రమంల్ ఈసినిమాలో రష్మిక రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ నటించడం నిజమేనా..? ఈ విషయాన్ని రష్మికనే అడిగారు ఓఇంటర్వ్యూలో.  రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో  రష్మిక మందాన ను కూడా ఇదే క్వశ్చన్ అడగగా తనకు  ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

అయితే ఇలా చెపుతూనే తాను కూడా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ న్యూస్ ను వింటున్నానని చెప్పారు. అంతే కాదు సినిమాకు సబంధించిన ట్విస్ట్ లు ఇవ్వడంతో  సుకుమార్ గారికి బాగా  అలవాటే కాబట్టి అతను ఉంటే ఉండొచ్చు అనేలా ఆమె ఓ హిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.  

మొత్తానికైతే విజయ్ దేవరకొండ పుష్ప 3 సినిమాలో నటిస్తున్నాడనేది చాలామంది అభిప్రాయం. ఇది నిజం అయ్యే అవకాశాలే ఎక్కువున్నట్టు తెలుస్తోంది. విజయ్ కనక పుష్ప 3 సినిమాలో ఉన్నట్లైతే పుష్ప 3 మూవీ దాదాపు ఇండస్ట్రీ హిట్టు కొట్టడం పక్క అంటూ సినిమా విశ్లేషకులు అంటున్నారు.  ఇంతకుముందు కూడా విజయ్ దేవరకొండ పుష్ప 3 ర్యాంపేజ్ మీద ఒక ట్వీట్ అయితే చేశారు.మరి తను అందులో బాగామవ్వబోతున్నాడా లేదా అనే దాని మీద ఇంకా స్పష్టత అయితే రాలేదు. 

Allu Arjun, #Pushpa2, sukumar

ఈ సినిమా మరో రెండు సంవత్సరాల తర్వాత సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ప్రస్తుతానికి సుకుమార్ అలాగే అల్లు అర్జున్ ఇద్దరు కమిట్ అయిన కమిట్మెంట్లను పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా మీద దృష్టి సారించబోతున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి పుష్ప ర రాంపేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో. 

Latest Videos

click me!