Feb 14, 2023, 12:55 PM IST
రామగుండం : ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మాదిరిగానే తెలంగాణ ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ''గడపగడపకు కేసీఆర్ సంక్షేమ ఫలాలు - ఇంటింటికి చందరన్న పాదయాత్ర'' ప్రారంభించారు. రామగుండం కార్పోరేషన్ పరిధిలోని 42వ డివిజన్ కార్పోరేటర్ బాలరాజుతో కలిసి ఎమ్మెల్యే చందర్ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాల గురించి వివరించారు. వేసే ప్రతి అడుగు ప్రజల కోసమే... చేసే ప్రతి పని అభివృద్ది కోసమే అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే చందర్ పాదయాత్ర సాగిస్తున్నారు.