నాగ చైతన్యను కొడుకుగా అంగీకరించలేకపోతున్న అమల, అఖిల్ తో ఒకలా, సవతి బిడ్డతో మరోలా, పెళ్లి వేళ బయటపడ్డ నిజాలు!

First Published | Nov 28, 2024, 10:25 AM IST

నాగ చైతన్యకు అమల సవతి తల్లి. వీరి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ లేదన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కొడుకు అఖిల్ విషయంలో ఒకలా చైతన్య విషయంలో మరోలా ఆమె ప్రవర్తిస్తున్నారు. 

 

నాగార్జునకు రెండు వివాహాలు. ఆ విషయం తెలిసిందే. నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మిని నాగార్జున వివాహం చేసుకున్నారు. అనంతరం కొన్నేళ్ళకు మనస్పర్థలతో విడిపోయారు. వీరికి నాగ చైతన్య సంతానం. తనతో పలు సినిమాల్లో కలిసి నటించిన హీరోయిన్ అమలను నాగార్జున ప్రేమ వివాహం చేసుకున్నారు. 

Amala Akkineni

అమల తల్లి ఐరిష్(ఐర్లాండ్) కాగా, తండ్రి బెంగాలీ. అమల పశ్చిమ బెంగాల్ కి చెందిన అమ్మాయి. సౌత్ ఇండియాలో హీరోయిన్ గా రాణించింది. అమల-నాగార్జునల సంతానం అఖిల్. కాగా నాగ చైతన్య బాల్యం అంతా చెన్నైలో గడిచింది. విడాకుల తర్వాత నాగార్జున మొదటి భార్య లక్ష్మీ.. చెన్నైకి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఆమె అక్కడకు వెళ్లిపోయారు. నాగ చైతన్య తల్లితో పాటు చెన్నై వెళ్లారు. 


అప్పుడప్పుడు నాగ చైతన్య హైదరాబాద్ వచ్చేవాడు. అలా వచ్చినప్పుడు కొన్ని రోజులు నాగార్జునతో ఉండేవాడట. పెద్దయ్యాక నాగ చైతన్య హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాడు. నాగ చైతన్యను తన వారసుడిగా చిత్ర పరిశ్రమకు నాగార్జున పరిచయం చేశాడు. అటు రామానాయుడు కూడా నాగ చైతన్యకు తాతయ్య అవుతాడు. కానీ హీరోని చేసే బాధ్యత నాగార్జున తీసుకున్నాడు. 

Naga Chaitanya-Sobhita Dhulipala

ఇదిలా ఉంటే.. అమలతో నాగ చైతన్యకు ఉన్న అనుబంధం ఏమిటనే ఓ చర్చ చాలా కాలంగా ఉంది. వీరిద్దరూ అన్యోన్యంగా కనిపించిన దాఖలాలు లేవు. అరుదుగా ఫ్యామిలీ ట్రిప్స్ కి వెళతారు. అప్పుడు అందరితో పాటు అమల, నాగ చైతన్య ఆ ఫొటోల్లో కనిపిస్తారు. చెన్నైలో నాగ చైతన్య పెరగడం వలన అమలకు నాగ చైతన్య దగ్గర కాలేకపోయాడు.ఈ క్రమంలో అమల నాగ చైతన్యను కొడుకుగా అంగీకరించలేకపోతున్నాడేమో అనే భావన కలుగుతుంది. 

దీనిపై తాజాగా స్పష్టత వచ్చింది. నాగ చైతన్య విషయంలో ఒకలా.. అఖిల్ విషయంలో ఆమె మరొకలా స్పందించారు. ఆగస్టు 8న నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది. నాగార్జున...  కొడుకు, కాబోయే కోడలు ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. శుభాకాంక్షలు తెలిపాడు. అమల మాత్రం నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టలేదు. అమల అరుదుగా సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడతారు. దాంతో ఈ మేటర్ ని ఎవరు సీరియస్ గా తీసుకోలేదు.. 

అయితే ఇటీవల అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇండస్ట్రియలిస్ట్ కూతురైన జైనాబ్ రవ్డ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. ఈ ఫోటోలను అమల తన అధికారిక సోషల్ మీడియాలో అకౌంట్స్ లో షేర్ చేశారు. వారికి శుభాకాంక్షలు చెప్పారు. సొంత కొడుకు అఖిల్ ఎంగేజ్మెంట్ పై సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన అమల.. అఖిల్ ఎంగేజ్మెంట్ ఫోటోలు పోస్ట్ చేయకపోవడం చర్చకు దారి తీసింది. 

సవతి కొడుకు నాగ చైతన్య పట్ల అమలకు అంత ఎఫెక్షన్ లేదు. నాగ చైతన్యను అమల కొడుకుగా అంగీకరించడం లేదంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ పుకార్లలో నిజం ఎంతో తెలియదు. కాగా నాగ చైతన్య-శోభితల వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా జరగనుంది. 

Latest Videos

click me!