ఏఎన్నార్ ముందే హీరోల బండారం బయటపెట్టిన స్టార్ నటి.. ముందు శ్రీరాముడిలా తర్వాత రావణుడిలా.. 

First Published | Nov 28, 2024, 10:53 AM IST

వాణిశ్రీ గతంలో టాలీవుడ్ హీరోల బిహేవియర్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండేవారు. ఒక ఈవెంట్ లో అక్కినేని నాగేశ్వర రావు ముందే ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

లెజెండ్రీ నటి వాణిశ్రీ.. సావిత్రి తర్వాత ఇండస్ట్రీలో అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్ర నటులతో ఎన్నో చిత్రాల్లో నటించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో వాణిశ్రీ అత్త, తల్లి పాత్రల్లో మెప్పించారు. వాణిశ్రీ గొప్ప నటి మాత్రమే కాదు ఫైర్ బ్రాండ్ కూడా. ఉన్నది ఉన్నట్లు ధైర్యంగా చెప్పేస్తారు. సెట్స్ లో కూడా తన లిమిట్స్ లో తాను ఉండేవాళ్ళట. 

వాణిశ్రీ గతంలో టాలీవుడ్ హీరోల బిహేవియర్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండేవారు. ఒక ఈవెంట్ లో అక్కినేని నాగేశ్వర రావు ముందే ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఎన్నార్ లాంటి హీరోలు తమతో పాటు నిర్మాతలని కూడా బాగా చూసుకునేవారు. కష్టాల్లో ఉన్న నిర్మాతలని ఆడుకునేవారు. ఎందుకంటే నిర్మాతల వల్లే ఆర్టిస్టులు బావున్నారు. ప్రస్తుతం హీరోలు నిర్మాతలని అసలు పట్టించుకోవడం లేదు. 


నిర్మాతని గౌరవిస్తూ వారు చెప్పినట్లు నడుచుకునే హీరో ఏఎన్నార్ గారు. దర్శకులకు, నిర్మాతలకు ఏఎన్నార్ అంత విలువ ఇచ్చేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎప్పుడూ కూడా నిర్మాతలతో గొడవ పెట్టుకోలేదు. వాళ్ళని అగౌరవ పరచలేదు అని వాణిశ్రీ తెలిపారు. 

ప్రస్తుతం ఇండస్ట్రీకి వస్తున్న హీరోలని గమనిస్తున్నా. ముందు రాముడిలా బిల్డప్ ఇస్తూ వస్తారు. నాలుగు వినిమాలు చేయగానే రావణాసురుడిలా మారిపోతుంటారు. నాగేశ్వర రావు గారు కానీ, రామారావు గారు కానీ ఎప్పుడూ అహంకారం చూపించలేదు అని వాణిశ్రీ ప్రశంసించారు. 

వాణిశ్రీ, ఏఎన్నార్ కలసి ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ దసరాబుల్లోడులో నటించారు. సావిత్రి తరహాలో కష్టాలు పడకూడదు అని వాణిశ్రీ.. ఎప్పుడూ ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారట. 

Latest Videos

click me!