
వికటకవి అనగానే తెనాలి రామకృష్ణ గుర్తు వస్తారు. ఓ థ్రిల్లర్ వెబ్ సీరిస్ కు ఆ పేరు పెట్టడం ఇంట్రస్టింగ్ విషయం. ఇక ఓటిటిలలో వచ్చే వెబ్ సీరిస్ లకు తెలుగులోనూ ఇప్పుడిప్పుడే మంచి ఆదరణ దక్కుతోంది. దాదాపు ఈ వెబ్ సీరిస్ లు అన్ని థ్రిల్లర్ మోడ్ లో నడుస్తున్నాయి. అయితే తెలుగులో వచ్చేవి తక్కువ.
ఎక్కువ డబ్బింగ్ సీరిస్ లే. ఈ సీరిస్ లు మొదటి ఎపిసోడ్ నుంచి చివరి వరకు సస్పెన్స్ మైంటైన్ చేయడం కొంచెం కష్టమే అయినా కొందరు బాగానే వర్కవుట్ చేస్తున్నారు. సీరిస్ లలో కథకు, పాత్రలకు స్పాన్ ఎక్కువ ఉండటంతో రకరకాల క్యారక్టర్స్ ,క్యారక్టరైజేషన్స్ తో స్క్రీన్ ప్లేని డిజైన్ చేసి సక్సెస్ కొడుతున్నారు. 'వికటకవి' ఈ తరహా నేరేషన్ కు కొద్దిగా భిన్నమే. థ్రిల్లర్ అయినా కొత్తగా ప్రయత్నించారు. ఈ క్రమంలో అసలు ఈ సీరిస్ కథేంటి.. చూడదగ్గ కంటెంట్ ఉంటా...ఎలా ఉంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
1948 నాటి ఈ కథ నల్లమల అడవుల నేపధ్యంలో సాగుతుంది. ఆ అడవుల్లో ఉన్న అమరగిరి సంస్థానంలో ఉన్న దేవతల గుట్ట దగ్గరికి ఎవరైనా వెళ్తే వాళ్ళు గతం మర్చిపోయి శరీరంలో స్పందన లేకుండా అయిపోతుంటారు. దానికి కారణం 25 ఏళ్ళ క్రితం జరిగిన ఓ సంఘటన వల్ల అమ్మవారు ఇచ్చిన శాపం అని ఊరంతా భావిస్తూంటారు. దీంతో ఎవరూ దేవతల గుట్ట వైపు వెళ్ళరు. అయితే నిజంగానే ఆ శాపం ఇప్పటికీ పని చేస్తుందా..అసలు విషయం ఏమిటో కనుక్కోవటానికి హైదరాబాద్ లో ఉన్న డిటెక్టివ్ రామకృష్ణ(నరేష్ అగస్త్య) బయిలుదేరతాడు. అతన్ని ఓ ప్రొఫెసర్ అక్కడకి డబ్బు ఆశ పెట్టి పంపుతాడు.
అక్కడ సమస్య పరిష్కరిస్తే డబ్బులు వస్తాయి. వాటితో తన తల్లికి ఆపరేషన్ చేయించొచ్చు అని రామకృష్ణ వెళ్తాడు. మొదట అమరగిరి రాజు(శిజు మీనన్) ఏ సమస్య లేదని వెళ్లిపొమ్మన్నా, ఆయన మనవరాలు లక్ష్మి(మేఘ ఆకాష్) కోరికపై రామకృష్ణ అక్కడ ఉంటాడు.
డిటెక్షన్ మొదలెడతాడు. ఆ క్రమంలో ఏం తేలిసింది. అసలు అడవిలో ఏం జరుగుతుంది అసలు దేవతల గుట్ట దగ్గర ఏం జరిగే విషయం ఏమిటి? అక్కడికి వెళ్లినవాళ్లందరికి మతి పోవటానికి కారణం వేరే ఏదైనా ఉందా? చివరకు డిటెక్టివ్ రామకృష్ణ ఈ సమస్య పరిష్కరించాడా?రాజు అల్లుడు ఎమ్మెల్యే రఘుపతి (రఘు కుంచె) పాత్ర ఏమిటి.. వంటి విషయాలు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
ఎలా ఉందంటే...
డిటెక్టివ్ కథలు ఎప్పుడూ ఆసక్తే. అందులోనూ థ్రిల్లింగ్ నేరేషన్ లో చెప్తే ఆ కిక్కే వేరు. థ్రిల్లర్ సినిమాలు లేదా వెబ్ సీరిస్ లలో హై పార్ట్ ఏమిటంటే...సస్పెన్స్ తో కలిసిన మంచి డ్రామా. థ్రిల్లర్ వెబ్ సీరిస్ లలో ఇంకెంచెం ఎక్కువ కష్టం ఉంటుంది. కథలో రిజల్యూషన్ ఇచ్చేదాకా టెన్షన్ పెంచుకుంటూ వెల్తూనే ప్రతీ ఎపిసోడ్ ఎండ్ ని ట్విస్ట్ లతో రన్ చేయగలిగాలి, సస్పెన్స్, టెన్షన్ ఈ నేరేషన్ లకు పౌండేషన్. ఆ విషయంలో దర్శకుడు చాలా వరకూ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
సస్పెన్స్, డ్రామా, చరిత్ర ఈ మూడింటిని కలిపి తయారు చేసుకున్న స్టోరీ లైన్ ఇంట్రస్ట్ గానే సాగింది. కొన్ని ట్విస్ట్ లు బాగానే పేలాయి. అయితే రైటింగ్ మరింత క్రిస్పీగా ఉండాల్సింది. రియలిజంకు జానపదం ను కలిపి ముడి వేయటం కొత్తగా అనిపిస్తుంది. అలా చేయటం వల్ల సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ నమ్మదగినవిగా ఉన్నాయి.
అయితే ప్రారంభంలో బాగానే ఉన్నా వెళ్లే కొలిదీ పేస్ బాగా ప్లాట్ గా అయ్యింది. సబ్ ప్లాట్స్ మీద ఇంకా వర్కవుట్ చేయాల్సిందని అర్దమవుతుంది. అలాగే స్టాక్ క్యారక్టర్స్, రెగ్యులర్ స్టోరీ టెల్లింగ్ కనపడి మొదటి ఉన్న బ్యూటీని చెడగొట్టే పోగ్రామ్ ని పెట్టుకుంటాయి.
లవ్ స్టోరీ కూడా సోసోగా ఉంది. అయితే డైరక్టర్ .. ప్రతీ డీటైలింగ్ చేసిన విధానం బాగుంది. అలాగే ఎపిసోడ్ ఎండింగ్ ఇంట్రస్టింగ్ గా నెక్ట్స్ ఎపిసోడ్ కి లీడ్ ఇచ్చేలా డిజైన్ బాగా చేసారు. విలన్ ..ముందే తెలిసిపోయినా..అతను అలా ఎందుకయ్యాడనేది చివరిదాకా ఎంగేజ్ చేస్తుంది. ఇలాంటి కొన్ని విషయాలు స్క్రిప్టు లెవిల్ లో బాగా రాసుకోవటం కలిసివచ్చింది.
టెక్నికల్ గా..
సీరిస్ లో కెమెరా వర్క్ చాలా బాగుంది. మరీ ముఖ్యంగా విలేజ్ సెటప్, అడవిలో సాగే నైట్ సీన్స్ , పీరియడ్ లుక్ అన్ని ఫెరఫెక్ట్ గా కాప్చర్ చేసి ఫీల్ తీసుకొచ్చారు. నల్లమల అడవుల్లో హాంటింగ్ సీన్స్ బాగున్నాయి. ఆ టైమ్ నాటి కాస్ట్యూమ్స్ , ప్రాపర్టీస్, సెట్స్ ఇలా ప్రతీ విషయంలోనూ ప్రొడక్షన్ డిజైన్ బాగా చేసారు.
కథకు తగ్గ మూడ్ ని క్రియేట్ చేయటంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సక్సెస్ అయ్యింది. అయితే ఈ సీరిస్ చాలా చోట్ల స్లో నేరేషన్ లో నడుస్తుంది. కాస్త స్పీడప్ చేసి ఉంటే బాగుండేది. డైలాగులు తెలంగాణా స్లాంగ్ బాగున్నాయి. అందరూ స్లాంగ్ ని మ్యాచ్ చేయలకపోయారు.
ఫెరఫార్మెన్స్ లు విషయానికి వస్తే...
నగేష్ అగస్త్య, రఘు కుంచె ఇద్దరూ సీరిస్ అయ్యపోయాక కూడా గుర్తుండిపోతారు. పలాస తర్వాత రఘు కుంచె ఈ సీరిస్ లో మంచి పాత్ర పడింది. విలన్ గా నటన చాలా ఇంటెన్స్ సాగింది. మేఘా ఆకాష్ మంచి సపోర్టింగ్ క్యారక్టర్.
ఫైనల్ థాట్
లాజిక్స్, కొన్ని మైనస్ లను పక్కన పెడితే.. వికటకవి గ్రిప్పింగ్‌గా, థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఒక సారి చూడటానికి ఇబ్బందేమీ పెట్టదు.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎక్కడ చూడచ్చు
Zee5లో తెలుగులో ఉంది