నలుగురు సాఫ్ట్ వేర్లను బలితీసుకున్న గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం... సిసి టివి వీడియో

Dec 13, 2020, 1:37 PM IST

హైదరాబాద్: ఆదివారం తెలవారడానికి కొద్దిసేపటి ముందు నలుగురు యువకుల జీవితాలు చీకట్లో కలిసిపోయాయి. గచ్చిబౌలిలోని విప్రో జంక్షన్ వద్ద గత రాత్రి 3గంటల సమయంలో వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి టిప్పర్ లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించగా మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అలాగే లారీ డ్రైవర్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. గాయపడిన ఇద్దరిని కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.