Mar 11, 2022, 11:09 AM IST
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలను తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందే పసిగట్టారు. ప్రభుత్వ వ్యతిరేకను ఎదుర్కునేందుకు అవసరమైన వ్యూహాలను రచించి, అమలు చేయడానికి యూపీ ఎన్నికల ఫలితాలను నమూనాగా తీసుకునే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆయన ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకునే ప్రకటన చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతోనే ఆయన తాయిలాలు ప్రకటించినట్లు భావిస్తున్నారు.