ఐపీఎల్‌లో హీరో, ధోనిలాంటి ఫినిష‌ర్, వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో అరంగేట్రం... కానీ

First Published | Nov 18, 2024, 5:48 PM IST

Team India : భారత మాజీ ఆల్ రౌండర్, లోక్‌సభ ఎంపీ అయిన‌ యూసుఫ్ పఠాన్ క్రికెట్ ప్ర‌పంచంలో త‌న‌దైన ముద్ర వేశాడు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సొంత‌ అన్నయ్య అయిన యూస‌ఫ్.. త‌క్కువ కెరీర్ కలిగి ఉన్నాడు, కానీ ఈ కాలంలో అతను చాలా మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు.
 

Team India : యూస‌ఫ్ ప‌ఠాన్.. క్రికెట్ లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ల‌కు పెట్టింది పేరు. అతను ఇంటర్నేషనల్‌లో కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అద్భుత‌మైన ఆట‌తో ఆక‌ట్టుకున్నాడు. అత్యంత విజయవంత‌మైన ప్లేయ‌ర్ గా కెరీర్ కొన‌సాగించాడు.

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌లను ఛాంపియన్‌లుగా చేయడంలో అతను ముఖ్యమైన పాత్ర పోషించాడు. క్రికెట్ లో స‌త్తా చాటిన యూస‌ఫ్ ప‌ఠాన్.. రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర వేయ‌డానికి ముందుకు సాగుతున్నాడు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నుండి లోక్‌సభ ఎంపీగా ఎన్నిక‌య్యాడు. 

২০০৭ সালে ভারতের প্রথম টি২০ বিশ্বকাপ জয়ী দলের সদস্য তিনি। ২০১১ সালে ৫০ ওভারের বিশ্বকাপের দলেও ছিলেন তিনি। দেশের জার্সিতে খেলেছেন একাধিক ম্যাচ উইনিং ঝোড়ো ইনিংস। এবার কিট ব্যাগ তুলে রাখার কথা জানালেন ইউসুফ পাঠান।

వ‌ర‌ల్డ్ క‌ప్ లో అరంగేట్రం..

ఒక క్రికెటర్‌ను తొలిసారి ప్రపంచకప్‌లో జట్టులోకి తీసుకుని ఫైనల్‌లో ఆడే అవకాశం వస్తే అతడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. 2007 టీ20 ప్రపంచకప్‌లో యూసఫ్ పఠాన్‌తో ఇదే జరిగింది. వీరేంద్ర సెహ్వాగ్ గాయం కారణంగా పాకిస్థాన్‌తో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆడాల్సి వచ్చింది.

యూసుఫ్ ఈ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో ప్రత్యేకంగా ఏమీ సాధించ‌లేక‌పోయాడు. అతను 15 పరుగులు, 1 ఓవర్ బౌలింగ్ వేసి 5 పరుగులు ఇచ్చాడు. కానీ,  ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. అతని తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.


యూస‌ఫ్ ప‌ఠాన్ కొన్ని సంవత్సరాలలో గొప్ప ఫినిషర్‌గా, పెద్ద హిట్టర్‌గా, అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ఉపయోగకరమైన బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. వేగంగా పరుగులు చేయడంతో పాటు పలుమార్లు వికెట్లు తీసి టీమ్ ఇండియాను గెలిపించాడు. కానీ పాపం అతను తన పూర్తి సామర్థ్యాన్ని ఎప్పుడూ సాధించలేదు.

తన కెరీర్‌లో ఎక్కువ భాగం యూసుఫ్ తన తమ్ముడు ఇర్ఫాన్ నీడలోనే ఉన్నాడు. అతను ఎప్పుడూ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. కేవలం 79 వ‌న్డే, టీ20 మ్యాచ్‌లలో మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 2012 తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.

"Nothing can keep me away from cricket and my passion for the sport will remain the same. I will continue to entertain everyone even in future," it concluded.

యూసుఫ్ పఠాన్ 2007లో,  అలాగే 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. పెద్ద స్కోర్లు సాధించ‌లేక‌పోయాడు.  అతని స్కోర్లు 8, 14, 30*, 11, 0, 11. ఆరు మ్యాచ్‌లు ఆడిన అతను ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. పఠాన్‌కు నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం రాలేదు. పేలవ ఫామ్ కారణంగా క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్ ఆడలేకపోయాడు.

యూసుఫ్ దాదాపు 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు 2021లో వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని అంతర్జాతీయ క్రికెట్ గణాంకాలను పరిశీలిస్తే, యూసుఫ్ 57 వన్డే మ్యాచ్‌లలో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో 810 పరుగులు చేశాడు. బౌలింగ్ విష‌యానికి వ‌స్తే 33 వికెట్లు తీసుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 22 మ్యాచ్‌లు ఆడి 236 పరుగులు, 13 వికెట్లు పడగొట్టాడు. అతనికి టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు.

యూసుఫ్ కెరీర్ దాదాపు 5 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. 2007లో అరంగేట్రం చేసిన తర్వాత యూసుఫ్ 2012 వరకు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 2012 మార్చి 30న దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్ తర్వాత అతనికి టీమ్ ఇండియాకు ఆడే అవకాశం రాలేదు. అతను తన చివరి వ‌న్డే మ్యాచ్ కూడా 2012లో మాత్రమే ఆడాడు. ఈ మ్యాచ్ 2012లో షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగింది. ఇది ఆసియా కప్ మ్యాచ్.

యూసుఫ్ 2008 ఆసియా కప్‌లో టీమ్ ఇండియాలో భాగమయ్యాడు, ఇది పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. ఫైనల్‌లో భారత్ శ్రీలంక చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అతను డిసెంబర్ 2010లో న్యూజిలాండ్‌పై పేలుడు సెంచరీతో 316 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించేలా చేయడంతో అతని వ‌న్డే కెరీర్ టాప్ స్థాయికి చేరుకుంది. ఇక‌ యూసుఫ్ 174 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 3204 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో అతని పేరిట సెంచరీ కూడా ఉంది. 13 అర్ధ సెంచరీలు కొట్టాడు. ఐపీఎల్‌లో మొత్తం 42 వికెట్లు కూడా తీశాడు. ఇదే స‌మ‌యంలో ఇర్ఫాన్ ప‌ఠాన్ అద్భుత‌మైన కెరీర్ ను కొన‌సాగించ‌డంలో యూస‌ఫ్ కు అత‌నిలా పెద్ద‌గా గుర్తింపు రాలేదు. 

Latest Videos

click me!