రాత్రిపూట ఇవి తినకపోతే.. తొందరగా బరువు తగ్గుతారు

First Published | Nov 18, 2024, 5:58 PM IST

బరువు తగ్గాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మీరు రాత్రిపూట కొన్ని రకాల ఆహారాలను తినకపోయినా కూడా తొందరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 

బరువు చిన్న సమస్య అయితే కాదు. ఎందుకంటే దీనివల్ల డయాబెటీస్, ఊబకాయం, హైబీపీ తో పాటుగా గుండె జబ్బులు కూడా వస్తాయి. అందుకే బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేయాలి. బరువు తగ్గాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయడంతో పాటుగా ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 

మీరు హెల్తీగా బరువు తగ్గాలంటే  మీ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. మీకు తెలుసా? మన జీర్ణవ్యవస్థ సహజమైన సిర్కాడియన్ రిథమ్ ను అనుసరిస్తుంది. అంటే ఉదయం బాగా పనిచేస్తే, రాత్రిపూట తక్కువగా పనిచేస్తుంది. అంటే మీరు రాత్రిపూట హెవీగా తింటే తిన్నది అరగదు. అలాగే శరీరంలో ఫ్యాట్ పేరుకుపోతుంది. దీనివల్ల మీరు మరింత బరువు పెరిగిపోతారు. 
 

బరువు తగ్గాలంటే మెటబాలిజం సక్రమంగా పనిచేయాలి. మన శరీర మెటబాలిజం పగటిపూట సక్రమంగా పనిచేస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అయితే మన జీర్ణవ్యవస్థ  మాత్రం సాయంత్రం నుంచి సక్రమంగా పనిచేయదు. ఇలాంటి సమయంలో మీరు హెవీగా తిన్నా, తినకూడని ఆహారాలను తిన్నా అది సరిగ్గా అరగదు. దీనివల్ల మీరు బరువు బాగా పెరిగిపోతారు. కాబట్టి బరువు తగ్గాలంటే రాత్రిపూట ఏం తినకుండా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Latest Videos


Weight Loss

స్తంభింపచేసిన ఆహారాలు

ప్రాసెస్ చేసిన, స్తంభింపచేసిన ఆహారాలను రాత్రిపూట ఎట్టిపరిస్థితిలో తినకూడదు. ఎందుకంటే ఇవి మీరు బరువు తగ్గకుండా చేస్తాయి. ఇవి ఎంత టేస్టీగా ఉన్నా వీటిలో ప్రమాదకరమైన సంరక్షణకారులను, కృత్రిమ ఎన్హాన్సర్లను, హైడ్రోజనేటెడ్ నూనెలను వాడుతారు.

వీటిని పదే పదే వేడిచేస్తుంటారు. దీనివల్ల వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిని తినడం వల్ల మీరు కొంచెం కూడా బరువు తగ్గరు. కాబట్టి బరువు తగ్గాలంటే ప్రాసెస్ చేసిన ఆహారాలను తినకండి.
 

మైక్రోవేవ్ పాప్ కార్న్

పాప్ కార్న్ ను తినని వారు ఎవరూ ఉండరు. కానీ మైక్రోవేవ్ పాప్ కార్న్ ను మీరు తినకపోవడమే మంచిది. ఎందుకంటే వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్, సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని గనుక మీరు సాయంత్రం వేళ తింటే మీరు అస్సలు బరువు తగ్గరు. మరింత బరువు పెరిగిపోతారు. 

కార్బోనేటేడ్ పానీయాలు

కూల్ డ్రింక్స్, కార్బోనేటేడ్ పానీయాలను చాలా మంది రాత్రిపూట బాగా తాగుతుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వీటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిని రాత్రిపూట తాగితే మీ జీర్ణక్రియ సరిగ్గా పనిచేయదు. అలాగే రాత్రిళ్లు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. ఇది మీరు మరింత బరువు పెరిగేలా చేస్తుంది. 

కెచప్

కెచప్ ను చాలా మంది  ఇష్టంగా తింటారు. కానీ దీనిలో హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఉంటుంది. దీనిలో చక్కెర కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మీరు గనుక కెచప్ ను ప్రతిరోజూ తీసుకుంటే బాగా బరువు పెరిగిపోతారు. ముఖ్యంగా రాత్రిపూట తీసుకుంటే మీ బరువు మీరు ఊహించని విధంగా పెరుగుతుంది. 

ఫ్రెంచ్ ఫ్రైస్

ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా టేస్టీగా ఉంటాయి. కానీ వీటిలో ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వులు,కేలరీలు ఉంటాయి. సాయంత్రం వేళ మన జీవక్రియ మందగిస్తుంది. ఇలాంటి టైంలో మీరు వీటిని తింటే మీరు బరువు తగ్గడం పక్కనుంచితే మరింత బరువు పెరిగిపోతారు. మీరు బరువు తగ్గాలంటే నిద్రపోవడానికి రెండు మూడు గంటల ముందు నుంచే ఏమీ తినకూడదు. 
 

click me!