తనకు డూప్‌ని పెడితే మహేష్‌ బాబు ఏం చేశాడో తెలుసా? కృష్ణతోపాటు యూనిట్ మొత్తం బిత్తరపోయిన ఘటన

First Published | Nov 18, 2024, 6:06 PM IST

మహేష్‌ బాబు చిన్నప్పట్నుంచే సాహసాలు చేసేవాడట. అయితే ఓ సారి డూప్‌ని పెడితే ఏం చేశాడో తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే. కృష్ణనే షాక్ లోకి వెళ్లాడట. 
 

Krishna Birth Anniversary

సూపర్‌ స్టార్‌ కృష్ణ ప్రయోగాలకు కేరాఫ్‌. తన సినిమా కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు చేశారు. సక్సెస్‌ అయ్యారు. అయితే తండ్రిలాగా మహేష్‌ బాబు సక్సెస్‌ కాలేదు. ఆయన ప్రయోగాలు చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో కమర్షియల్‌ సినిమాలకే ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు మహేష్‌. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

అయితే ప్రయోగాలే కాదు, సాహసాలు చేయడం కూడా మహేష్‌కి చిన్నప్పట్నుంచే అలవాటు. బయట కూడా చిన్నప్పుడే కారు నడిపి అందరికి షాకిచ్చాడట. బైక్‌ నేర్చుకుని కృష్ణకే మతిపోయేలా చేశాడట. అంతేకాదు సినిమాల షూటింగ్‌లోనూ అలాంటి సాహసాలే చేసి షాకిచ్చారట. సూపర్‌ స్టార్‌ కృష్ణ ఈ విషయాన్ని బయటపెట్టారు. మహేష్‌ ఒళ్లు దాచుకోవడానికి ఇష్టపడడని, ఏదైనా తనే చేయాలనుకుంటాడని, బాలనటుడిగానే కాదు, హీరోగానూ అలాంటి స్టంట్లు చేశాడని తెలిపారు కృష్ణ. 


కృష్ణ నటించిన `శంఖారావం` సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో కృష్ణతోపాటు బాలనటుడిగా మహేష్‌బాబు కూడా నటించారు. ఇందులో మహేష్‌ ఓ స్టంట్‌ చేయాల్సి ఉంది. అయితే మహేష్‌కి బదులుగా డూప్‌ని తీసుకొచ్చారట. తనలాగే ఉన్నాడు, సేమ్‌ డ్రెస్‌ వేసుకుని ఉన్నాడు. అతను ఎవరు అని అడిగితే మీ డూప్‌ అని చెప్పారట. ఏం చేస్తాడంటే ఓ హైట్‌ నుంచి ఫల్టీ కొడతాడు, కిందకు వచ్చాక మీ క్లోజప్‌తో మ్యానేజ్‌ చేస్తాం, మీరే చేసినట్టు అవుతుందన్నారట. అది నచ్చని మహేష్‌ తానే చేస్తాను కదా, అతనెందుకు అని చెప్పి, వెంటనే పైకి వెళ్లి ఫల్టీ కొట్టాడట. కెమెరా లేకుండా అది చేశాడు. చూసిన వారంతా షాక్‌. అంతేకాదు వెంటనే ఆ డూప్‌ని పంపించేశాడట మహేష్‌. 

అది తనకు పెద్ద ఆశ్చర్యంగా అనిపించిందన్నారు కృష్ణ. దీంతోపాటు `కొడుకు దిద్దిన కాపురం` సినిమాలోనూ సేమ్‌ అలానే చేశాడు. ఓ కొండపై నుంచి బైక్‌ ని డ్రైవ్‌ చేసుకుంటూ రావాల్సి ఉంది. అప్పుడు కూడా డూప్‌ పెడతానంటే వద్దని చెప్పి మార్నింగ్‌ ఐదు గంటలకు సెట్‌కి వెళ్లి ఆ స్టంట్‌ తనే చేశాడట. దానికోసం ముందుగానే బైక్‌ నేర్చుకున్నాడట మహేష్‌. కృష్ణ ఎనిమిది గంటలకు సెట్‌కి వస్తారని తెలిసి ఏడు గంటలకు ఆ షాట్‌ని కంప్లీట్ చేసి ఏం తెలియనట్టుగా కూర్చున్నాడట. నాన్నకి చెప్పొద్దు అని చెప్పి టీమ్‌ అందరిని మ్యానేజ్‌ చేసి ఆ స్టంట్‌ చేసేశాడట. అది మరోసారి తనకు సర్‌ప్రైజింగ్‌గా అనిపించిందన్నారు కృష్ణ. 
 

Mahesh Babu

హీరో అయిన తర్వాత కూడా `టక్కరిదొంగ` సినిమాలో బ్రిడ్జ్ పై నుంచి చేసే యాక్షన్‌ సీన్‌ కూడా తనే స్వయంగా చేశాడట. హీరో అయ్యాక రిస్క్ తీసుకోవద్దని కృష్ణ చెప్పినా వినలేదట. అలాంటి సాహసాలు చేసేందుకు బాగా ఇష్టపడతాడని, ఏమాత్రం ఒళ్లు దాచుకోడని చెప్పారు కృష్ణ. `పోకిరి` సినిమా తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృష్ణ ఈ విషయాలను పంచుకున్నారు. 
 

ప్రస్తుతం మహేష్‌ బాబు.. రాజమౌళితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడిది ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా షూటింగ్‌ స్టార్ట్ కాబోతుందని సమాచారం. దీనికి సంబంధించిన స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది. రాజమౌళి మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అయితే. పక్కాగా స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ కంప్లీట్ అయ్యాకనే షూటింగ్‌కి వెళ్తారనే విషయం తెలిసిందే.

ఇక ఈ మూవీని ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో, గ్లోబల్‌ ఫిల్మ్ గా తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు జక్కన్న. ఫారెస్ట్ నేపథ్యంలో సాగే యాక్షన్‌ అడ్వెంచరస్‌గా సినిమా సాగుతుందట. చాలా అడ్వెంచర్స్ ఉంటాయట. మరి మహేష్‌ వాటిని సొంతంగానే చేస్తారా? డూప్‌ని వాడతారా? అనేది చూడాలి. అయితే ఓ స్థాయికి వచ్చాక ఏ హీరో అయినా డూప్‌లను వాడతారనే విషయం తెలిసిందే. 

Read more:సంక్రాంతి మొనగాడు సూపర్‌స్టార్‌ కృష్ణ ఫస్ట్ టైమ్‌ బరిలోకి దిగిన సినిమా ఏంటో తెలుసా? ఎన్టీఆర్‌కే మతిపోయింది

also read: 0వేల కోట్లకు అధిపతి అయిన హీరో ఎవరో తెలుసా? రామారావు, అక్కినేని, చిరంజీవి వంటి హీరోలంతా ఆయన ముందు జుజూబి

Latest Videos

click me!