కేబుల్ టీవీ, సెట్-టాప్ బాక్స్ లతో ప‌నిలేదు.. 500 TV ఛానెల్స్, OTT యాప్స్ తో BSNL ఉచిత టీవీ సర్వీస్

First Published | Nov 18, 2024, 6:39 PM IST

BSNL Free TV &OTT Service : భార‌త ప్ర‌భుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ మ‌రో అద‌రిపోయే కొత్త సేవ‌ల‌ను ప్రారంభించింది. కేబుల్ టీవీ అవ‌స‌రం లేదు. సెట్-టాప్ బాక్స్ లతో ప‌నిలేదు. ఏకంగా 500 TV ఛానెల్స్, OTT యాప్స్ తో BSNL ఉచిత టీవీ సర్వీసుల‌ను ప్రారంభించింది. 
 

BSNL IFTV

BSNL Free TV Service: ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL-బీఎస్ఎన్ఎల్) యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. కేబుల్ టీవీ అవ‌స‌రం లేకుండా... సెట్-టాప్ బాక్స్ లతో ప‌నిలేకుండా.. ఏకంగా 500 TV ఛానెల్స్, OTT యాప్స్ తో BSNL ఉచిత టీవీ సర్వీసుల‌ను ప్రారంభించింది. ఇందులో గేమింగ్ ఆప్షన్‌లతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, జీ5 వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లు కూడా అందుబాటులో ఉంటాయ‌ని బీఎస్ఎన్ఎల్ స్ప‌ష్టం చేసింది.

ఇటీవల  దేశంలో మొదటి ఫైబర్ ఆధారిత ఇంట్రానెట్ టీవీ సేవల‌ను ప్రారంభించింది బీఎస్ఎన్ఎల్. దీనిని IFTV అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోని ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులో ఉండ‌గా, త్వ‌ర‌లోనే అన్ని ప్రాంతాల‌కు విస్త‌రించ‌నున్న‌ట్టు తెలిపింది. 

ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) చందాదారుల కోసం BSNL కొత్త లోగో మరో ఆరు కొత్త సేవ‌ల‌ను ప్రారంభించింది. ఈ కొత్త సేవ‌ల‌తో పాటు IFTVని కూడా ప‌రిచ‌యం చేసింది. 


IFTTV వివిధ రకాల ప్రత్యక్ష ప్రసార ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. BSNL సోషల్ మీడియాలో పంచుకున్న స‌మాచారం ప్రకారం.. ఈ ఐఎఫ్‌టీవీ సేవలో 500కి పైగా లైవ్ ఛానెల్‌లు చూడ‌వ‌చ్చు. అయితే దాని అధికారిక వెబ్‌సైట్ 300 కంటే ఎక్కువ ఛానెల్‌లు మధ్యప్రదేశ్, తమిళనాడు కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. 

IFTTV వినియోగదారులకు స్పష్టమైన విజువల్స్, పే టీవీ సౌకర్యంతో ప్రత్యక్ష టీవీ సేవలను అందించడానికి BSNL ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంది. బీఎస్ఎన్ఎల్ జాతీయ Wi-Fi రోమింగ్ సర్వీస్‌ను ప్రారంభించిన తర్వాత ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. దీతో బీఎస్ఎన్ఎల్ కస్టమర్‌లు దేశవ్యాప్తంగా ఉన్న BSNL హాట్‌స్పాట్‌లలో వారి డేటా ధరతో సంబంధం లేకుండా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.

BSNL

X లో ఒక పోస్ట్‌లో BSNL దాని కొత్త IFTV సేవలు మధ్యప్రదేశ్, తమిళనాడులోని కస్టమర్‌లు అధిక స్ట్రీమింగ్ నాణ్యతతో 500కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుందని హైలైట్ చేసింది. అలాగే, పే టీవీ కంటెంట్‌ను కూడా అందిస్తుందని తెలిపింది.

రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ అందించే ఇతర ప్రత్యక్ష టీవీ సేవల మాదిరి కాకుండా, స్ట్రీమింగ్ ద్వారా వినియోగించే డేటాకు ఎలాంటి కోత ఉండ‌దు. అంటే BSNL IFTV విషయంలో డేటాకు ఎలాంటి ఛార్జీలు ఉండ‌వ‌ని చెప్ప‌వ‌చ్చు.

టీవీ స్ట్రీమింగ్ కోసం ఉపయోగించే డేటా వారి డేటా ప్యాక్‌ల నుండి వేరుగానే ఉంటుంద‌ని, FTTH ప్యాక్ నుండి తీసివేయబడదని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. అంటే స్ట్రీమింగ్ కోసం అపరిమిత డేటాను అందిస్తుంది. లైవ్ టీవీ సేవ BSNL FTTH కస్టమర్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని తెలిపింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ZEE5 వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లు, స్ట్రీమింగ్ యాప్‌లకు కూడా ఇది స‌పోర్టు చేస్తుంద‌ని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. 

మ‌రో సూప‌ర్ విష‌యం.. ఇది గేమ్‌లను కూడా అందిస్తుంది. గేమింగ్ లవర్స్ కు ఇది గొప్ప న్యూస్ అని చెప్పాలి. కాగా, ప్ర‌స్తుతం IFTV సేవలు ఆండ్రాయిడ్ టీవీలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 10 లేదా ఆ తర్వాత వెర్షన్‌తో నడుస్తున్న టీవీలను కలిగి ఉన్న వినియోగదారులు Google Play Store నుండి BSNL లైవ్ టీవీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ఈ సేవ‌ల‌ను మీరు ఉప‌యోగించుకోవాలంటే ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న BSNL సెల్ఫ్‌కేర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దాని నుంచి మీరు న‌మోదుచేసుకోవ‌చ్చు.

Latest Videos

click me!