ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ తో ఫస్ట్ రొమాన్స్ చేసిన లక్కీ హీరో ఎవరు? ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్

First Published | Nov 18, 2024, 6:42 PM IST

అభిషేక్ బచ్చన్ తో ఐశ్యర్య రాయ్ విడిపోతున్నారన్న వార్తల నడుమ ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 

ఐశ్వర్య, అభిషేక్ ల మధ్య విబేధాలు

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ల మధ్య మనస్పర్థలు తలెత్తాయని నెలలుగా వార్తలు వస్తున్నాయి. బచ్చన్ కుటుంబం ఐశ్యర్య రాయ్ ని పక్కన పెడుతున్నట్లు ఊహాగానాలు వినబడుతున్నాయి. ఐశ్వర్య లేకుండా బచ్చన్ కుటుంబం కనిపించడం చర్చకు దారి తీస్తుంది. బచ్చన్ కుటుంబ సభ్యుల ప్రవర్తనను మీడియా, సమాజం గమనిస్తుంది. ఈ క్రమంలో  ఐశ్యర్యకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

ఇరువర్ (1997)

ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ఇరువర్‌(1997)తో సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో ఆమె మలయాళ సూపర్‌స్టార్ అయిన మోహన్‌లాల్‌తో కలిసి నటించారు, ఆయన్ని ఐశ్వర్య రాయ్ మొదటి సినిమా హీరో అని చెప్పొచ్చు. ఐశ్వర్యతో రొమాన్స్ చేసిన ఫస్ట్ హీరో ఆయనే. 
 


ఐశ్వర్య రాయ్, మోహన్ లాల్

ఎం.జి.రామచంద్రన్, ఎం. కరుణానిధి, జె. జయలలిత జీవితాల స్ఫూర్తితో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా ఇరువర్. సినిమా, రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్‌లాల్ ఎంజీఆర్ పాత్రలో నటించారు. ఐశ్వర్య రాయ్ పుష్పవల్లి, కల్పన అనే రెండు పాత్రలను పోషించారు. 

మోహన్ లాల్ నటన దేవుడిచ్చిన వరం

ఐశ్వర్య రాయ్ బచ్చన్ తరచుగా దర్శకుడు మణిరత్నం పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఆమె తన మొదటి సినిమా హీరో మోహన్‌లాల్‌ను కూడా అంతే ఆరాధించేది. లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడం గురించి అడిగినప్పుడు, ఐశ్వర్య "మోహన్‌లాల్ కి నటన దేవుడిచ్చిన వరం" అని అన్నట్లు సమాచారం. అతని అద్భుతమైన ప్రతిభ పట్ల ఆమెకున్న గౌరవాన్ని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. 
 

ఐశ్వర్య అందమైన నటి: మోహన్ లాల్

ఇరువర్‌లో మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ నటనను మణిరత్నం ప్రశంసించారు, అందులో ఆమె రెండు విభిన్న పాత్రలను పోషించింది, వాటిలో ఒకటి నటి-రాజకీయ నాయకురాలు జె. జయలలిత నుండి ప్రేరణ పొందింది. ఆమెను "అద్భుతమైన నృత్యకారిణి" అని అభివర్ణించాడు, నటిగా ఐశ్యర్య అద్భుతమని మణిరత్నం అన్నారు. 

చాలా కాలం క్రితం ఒక ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో, మోహన్‌లాల్ ఐశ్వర్య అందం గురించి మాట్లాడారు. "ఆమె చాలా డౌన్-టు-ఎర్త్ అమ్మాయి అని నాకు అర్థమైంది. నటిగా కూడా ఆమె చాలా ప్రతిభ కలది. నేను ఆమెతో కలిసి నటించడం వలన ఈ మాటలు చెప్పడం లేదు'' అని అన్నారు. 

మరోవైపు ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ తో విడాకుల వార్తలపై స్పందించడం లేదు. ఆమె మౌనంగానే ఉన్నారు. ఐశ్యర్య రాయ్ మౌనం కూడా అనుమానాలకు దారి తీస్తుంది. అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు ఐశ్యర్య, అమితాబ్ కుటుంబం వేర్వేరుగా హాజరయ్యారు. అప్పుడు ఈ విడాకుల పుకార్లు మరింత బలపడ్డాయి. 

Latest Videos

click me!