Jan 21, 2022, 11:02 AM IST
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే ప్రయత్నాలను తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ప్రారంభించారు. సీపీఎం నాయకులు కేసీఆర్ ను కలిశారు. అలాగే తేజస్వీ యాదవ్ కూడా కేసీఆర్ ను కలిశారు. మరో వైపు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కూడా బిజెపిని ఢీకొట్టేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. బిజెపి వ్యతిరేక వైఖరి పట్ల వారు స్థిరంగా ఉన్నారు. కేసీఆర్ అంత నిలకడగా బిజెపి వ్యతిరేక వైఖరిని ప్రదర్శించడం లేదు. ఈ స్థితిలో ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూద్దాం.