Jul 22, 2022, 11:00 AM IST
ఉత్తర తెలంగాణ భారీగా వర్షాలు కురిసి వరదలు ముంచెత్తాయి. కాళేశ్వరం పంపులు వరదల్లో మునిగాయి. వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించిన కెసిఆర్ వింత ప్రకటన చేశారు. భారీ వర్షాల వెనక అంతర్జాతీయ కుట్ర ఉందని, క్లౌడ్ బరెస్ట్ కారణంగా భారీ వర్షాలు కురిశాయని ఆయన వ్యాఖ్యానించారు. దానిపై తెలంగాణ బిజెపి నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపు సంభవించిందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన విమర్శకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కొద్ది మంది రాష్ట్ర విభజనపై వ్యాఖ్యలు చేశారు. దీని పరిణామాలేమిటో చూద్దాం..